సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 13 ఏప్రియల్ 2023 (16:28 IST)

యముడి పాత్రలో సాయికుమార్ నటించిన యమ డ్రామ విడుదలకు సిద్ధం

Saikumar
Saikumar
నాటకాల్లో తొలిసారి యముడి పాత్రలో నటించిన సాయికుమార్ ఇప్పడు సినిమాలో తొలిసారి యముడి పాత్రను పోషించా రు. ఆ సినిమా పేరు  "యమ డ్రామ".  .ఫిల్మీ మెజీషియన్స్ పతాకంపై యువచంద్ర, శివకుమార్, కౌటిల్య, సుదర్శన్ రెడ్డి హీరోలుగా, ప్రియాంక శర్మ (సవారి ఫేమ్), నేహాదేశ్ పాండే, హమీద హీరోయిన్లుగా నటించారు. టి.హర్షచౌదరి దర్శకత్వంలో తోటకూర శివరామకృష్ణారావు నిర్మించిన ఈ సినిమా విడుదలకు సన్నద్ధమవుతోంది. 
 
కాగా ఈ సినిమాలోని "నిను చూసినాకనే..." అనే  మొదటి పాటకు కరుణాకర్ సాహిత్యం అందించారు సునీల్ కశ్యప్ బాణీలు సమకూర్చారు. కాగా ఈ వీడియో సాంగ్ పాటను హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో అతిధిగా పాల్గొన్న తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ కె.ఎల్.దామోదర ప్రసాద్ విడుదల చేశారు. 
 
అనంతరం ఆయన మాట్లాడుతూ, "ఈ చిత్ర బృందం సినిమా మొదలు పెట్టిన తర్వాత కరోనా విలయతాండవం చేసినప్పటికీ, అలాంటి కష్టాలను అన్నింటినీ అధిగమించి, సినిమాను పూర్తి చేసి, విడుదలకు సన్నాహాలు చేస్తుండటం అభినందనీయం. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకులను అలరింపజేస్తుందన్న నమ్మకం ఉంది" అని అన్నారు. మరో అతిథిగా పాల్గొన్న ప్రముఖ నిర్మాత డి.ఎస్.రావు మాట్లాడుతూ, కొత్త డైరెక్టర్లు చిన్న సినిమాలతో పెద్ద విజయాలను సాధిస్తున్నారు. సోసియో ఫాంటసీ థ్రిల్లర్ అనగానే సక్సెస్ ఫార్ములా కథా వస్తువులుగా నిరూపించుకున్నాయి. ఆ తరహాలో ఈ సినిమా తాజా ఉదాహరణ అవుతుంది" అని అన్నారు.
 
చిత్ర దర్శకుడు టి.హర్షచౌదరి మాట్లాడుతూ, "సీనియర్ నటుడు సాయికుమార్ మొదటి సారి ఈ సినిమాలో యముడి పాత్రలో నటించడం ఓ హైలైట్. మంచి వినోదం, భావోద్వేగాలను రంగరించి, ఆద్యంతం ఆకట్టుకునేలా  రూపొందించిన ఈ సినిమాలో యూత్ కు ఓ మంచి సందేశం కూడా ఉంది. ఫ్యామిలీస్, ఫ్రెండ్స్, లవర్స్ వంటి అన్ని వర్గాల వారు మెచ్చేలా దీనిని మలిచాం" అని చెప్పారు.
 
నిర్మాత టి.శివరామకృష్ణారావు మాట్లాడుతూ, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఏప్రిల్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని  వెల్లడించారు. హీరోలలో ఒకరైన కౌటిల్య మాట్లాడుతూ, ఇందులో  నటనకు అవకాశం ఉన్న పాత్రను పోషించానని చెప్పారు
 
ఈ సినిమాలోని ఇతర ముఖ్య పాత్రలలో  పోసాని కృష్ణమురళి, శివన్నారాయణ, వేణు వండర్స్, జెన్ని, గౌతంరాజు తదితరులు తారాగణం. సినిమాటోగ్రఫీ: దాము నర్రావుల, సంగీతం: సునీల్ కశ్యప్, ఎడిటింగ్: ఉద్దవ్. సమర్పణ: సుకన్య, నిర్మాత: టి.శివరామకృష్ణారావు, దర్శకత్వం: టి.హర్షచౌదరి.