శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 13 ఫిబ్రవరి 2024 (16:48 IST)

యాత్ర 2 దర్శకుడు మహి వి .రాఘవకు రెండు ఎకరాల లాండ్ పై ఓ. కళ్యాణ్ స్పందన

O.kalyan - mahi v raghava
O.kalyan - mahi v raghava
ఇటీవలే వై.ఎస్. జీవిత కథపై దర్శకుడు మహి వి .రాఘవ తీసిన చిత్రం యాత్ర 2 . ఈ సినిమా బాగుందని ఎమోషన్స్ బాగా పండించామని ఇటీవలే సక్సెస్ మీట్ పెట్టారు. అయితే ఈ సినిమా విడుదల తర్వాత దర్శకుడికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రెండు ఎకరాల స్థలం ఇస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
 
హార్సిలీ హిల్స్, రాయలసీమలో మహివి .రాఘవ దర్శకుడు రెండు ఎకరాల లాండ్ ఆంధ్ర ప్రభుత్వాన్ని కోరారు. త్వరలో అది కార్యరూపం దాల్చనుందని ఓ ప్రతిక ప్రచురించింది. ఇది కరెక్ట్ నా? అంటూ తగువిధంగా అందులో సారాంశం వుంది. దీనిపై ఎ.పి. ఫెడరేషన్ కు చెందిన మాజీ నాయకుడు ఓ. కళ్యాణ్ ఆ ప్రతికాధిపతిపై ప్రశ్నలు సంధిస్తూ నేడు వీడియో విడుదల చేశాడు.
 
ఉమ్మడి ఆంద్రప్రదేశ్ వుండగా, 14 ఎకరాల స్థలాన్ని నాగేశ్వరరావుకు ప్రభుత్వం ఆనాడు ఇచ్చింది. పద్మాలయ స్టూడియో, ఆనంద్ సినీ సర్వీసెస్ కు జూబ్లీ హిల్స్ లో ఇచ్చింది. ప్రసాద్ ల్యాబ్ కోసంబంజారా హిల్స్, రాఘవేంద్రరావుకు, మ్యూజిక్ డైరెక్టర్ చక్రి, ఐమాక్స్ థియేటర్ కోసం ఫిలిం డెవలప్ కోసం ప్రసాద్ గారికి ఇచ్చింది. అదేవిధంగా 67 ఎకరాలు స్థలం హైదరాబాద్ దర్గాసెంటర్ లో, నానక్ రామ్ గూడా వెళ్ళే రూటులో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ వచ్చాక జైబోలో తెలంగాణ సినిమాను తీసిన ఎన్. శంకర్ కు తెలంగాణ ప్రభుత్వం ఐదు ఎకరాల స్థలం ఇచ్చింది.
 
ఇవన్నీ తెలుగు సినిమా అభివ్రుద్ధి కోసం చేవారు. రుషి కొండ లో రామానాయుడుకు మరలా  తొమ్మిది ఎకరాలు ఇచ్చారు. అయితే రాఘవ దర్శకుడుకు రెండు ఎకరాలు సంతర్పారణం అని రాయడం కరెక్ట్ కాదు. ఇందుకు సంబంధించిన జీవో రాలేదు. కానీ దర్శకుడు రాఘవకు ఇవ్వడం తప్పు అని ఆంద్రజ్యోతిలో ప్రచురిండం తప్పుడు కథనంగా మార్చారు. అందుకే పైన ఇచ్చిన స్థలాలు తప్పుగా ఇచ్చిందని భావిస్తే, రాఘవకు ఇవ్వప్రయత్నం తప్పు అని రాయండి అంటూ తెలియజేస్తున్నాడు. ఓ.కళ్యాణ్ కూడా గతంలో పలు వివాదాలకు కారణబూతుడయ్యాడు. ఏది ఏమైనా వై.ఎస్. కుటుంబానికి సన్నిహితుడు అయిన మహి రాఘవకు స్థలం ఇవ్వడంలో తప్పులేదని కొందరు తెలియజేస్తున్నారు. మరి ముందు ముందు ఎ.పి.లో అందులో రాయలసీమలో చలనచిత్రరంగం డెలవప్ అవుతుందా? లేక దర్శకుడు రాఘవకు వ్యక్తిగతంగా స్థలం ఇస్తుందా? అనేది కొద్ది రోజులలో తేలనుంది.