శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Updated : బుధవారం, 13 నవంబరు 2019 (17:11 IST)

వోల్గా వీడియోస్‌కు అవార్డు.. నిహారిక, యూట్యూబ్ చీఫ్ చేతుల మీదుగా..

అనాది కాలం నుంచి అలరిస్తూ వస్తూ.. వీడియో క్యాసెట్ల సంస్థల్లోనే అప్పటికీ ఇప్పటికీ నెంబర్ స్థానం లో నిలుస్తూ వస్తున్న సంస్థ వోల్గా వీడియోస్. నేటి యూట్యూబ్ కాలంలో కూడా మీడియా విలువలను  కాపాడుతూ.. నిష్ణాతులైన  సిబ్బందితో నిరంతరం పురోగతిని సాధిస్తూ విజయవంతంగా దూసుకెళ్తున్న ఓల్గా వీడియోస్ సంస్థ కు ప్రముఖ యూట్యూబ్ సంస్థ అరుదైన గౌరవాన్ని ఇచ్చి సత్కరించింది.
 
వివరాల్లోకి వెళితే.. గూగుల్ సంస్థ వారి విజయోత్సవ వేడుకలో భాగంగా.. యూట్యూబ్‌లో అప్లోడ్ అయ్యే ప్రసారల్లో అత్యున్నత నాణ్యత విలువలతో కూడిన వీడియోస్ ను ప్రసరింప చేస్తుండడంతో పాటు కోటికి పైగా అత్యధిక సబ్ స్క్రైబర్స్‌ను కలిగి బిలియన్ల వ్యువర్స్‌ను పొందుతున్న యూట్యూబ్ వీడియోస్‌లకు గానూ యూట్యూబ్ టీమ్ ఇంచార్జ్ సిద్దార్థ్ సమక్షంలో వోల్గా వీడియోస్ సంస్థ అధినేతలైన రవినాథ్ మరియు ప్రసాద్‌లను సగర్వంగా సత్కరించి "యూట్యూబ్ డైమెండ్ బటన్" అవార్డును అందచేసింది.
 
ఈ అవార్డు ప్రధాననోత్సవ కార్యక్రమంలో... మెగానటి నీహారిక కొణిదెల, ఆదిత్య ఆడియో సంస్థ  అధినేత గుప్తాలు పాల్గొని వోల్గా వీడియోస్ వారికి తమ అభినందనలను, శుభాకాంక్షలను తెలియచేసారు.