శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 5 అక్టోబరు 2019 (14:42 IST)

ఉపాసనకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లీడర్ అవార్డు

స్టార్ హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెలను గాంధీ అవార్డు వరించింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఆమెకు ఈ అవార్డును ప్రదానం చేశారు. గాంధీ 150 జయంతి సందర్భంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లీడర్ విభాగంలో ఈ అవార్డుకు ఉపాసనను ఎంపిక చేశారు. 
 
తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో అవార్డును అందుకున్న ఆమె, సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేశారు. ఈ అవార్డు తనకు మరింత ప్రేరణ కలిగించిందన్నారు. ఇతరులకు సేవ చేయడం ద్వారా... నిన్ను నువ్వు కోల్పోయే క్రమంలో, నీలోని నిజమైన మనిషిని కనుగొనవచ్చన్నారు.
 
అలాగే, ఈ గాంధీ జయంతి తన కుటుంబానికి నూతన ఉత్సాహాన్ని అందించిందని, 'సైరా'పై ప్రేమ కురిపిస్తున్న అభిమానులందరికీ కృతజ్ఞతలంటూ ఉపాసన ట్వీట్‌లో పేర్కొన్నారు. 'సైరా' చిత్రాన్ని ఉపాసన భర్త అయిన హీరో రామ్ చరణ్ సొంతంగా నిర్మించిన విషయం తెల్సిందే.