చంటి బిడ్డతో లండన్ వీధుల్లో చక్కర్లు కొట్టిన ఉప్సీ

sania son
Last Updated: సోమవారం, 24 జూన్ 2019 (17:23 IST)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన అలియాస్ ఉప్సీ. ఈమె చంటి బిడ్డతో లండన్ వీధుల్లో చక్కర్లు కొట్టింది. ఏంటి.. చెర్రీ - ఉప్సీ దంపతులకు ఇంకా పిల్లలు పుట్టలేదు కదా, మరి చంటిబిడ్డతో చక్కర్లు కొట్టడం ఏంటనే కదా మీ సందేహం. అయితే, ఈ కథనం చదవండి.

ఇంగ్లండ్ వేదికగా ఐసీసీ వరల్డ్ క్రికెట్ కప్ పోటీలు సాగుతున్నాయి. ఈ పోటీలను తిలకించేందుకు ఉపాసన తన స్నేహితులతో కలిసి లండన్‌కు వెళ్లింది. ఈ పోటీల కోసం తన భర్త, క్రికెట్ షోయబ్ మాలిక్‌తో కలిసి భారత టెన్నిస్ స్టార్, పాకిస్థాన్ కోడలైన సానియా మీర్జా తన చంటి బిడ్డతో కలిసి లండన్‌కు వచ్చింది.

ఆ సమయంలో సానియా కుటుంబంతో కొంతసేపు గడిపింది. ఈ సందర్భంగా సానియా మీర్జా కుమారుడు ఇజ్జు(ఇజ్హాన్ మీర్జా మాలిక్)తో కలిసి సందడి చేశారు. అపుడు ఇజ్జును చంకలో పెట్టుకుని లండన్ వీధుల్లో చక్కర్లు కొడుతూ ఫోటోలు దిగారు. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయగా, అవి ఇపుడు వైరల్ అయ్యాయి.

ఆదివారం పాకిస్థాన్ - సౌతాఫ్రికా జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో సఫారీలు ఓడిపోయి, సెమీస్ రేసు నుంచి నిష్క్రమించారు. ఈ మ్యాచ్‍‌ను సానియా మీర్జా తన బిడ్డతో కలిసి తిలకించేందుకు స్టేడియానికి వచ్చింది. ఇదే మ్యాచ్ కోసం ఉపాసన కూడా ఆ స్టేడియానికి రాగా, వారిద్దరూ సందడి చేశారు.

కాగా, సానియా మీర్జాకు.. ఉపాసనకు మంచి స్నేహానుబంధం ఉంది కూడా. హైదరాబాద్‌లో సానియా మీర్జా టెన్నీస్ అకాడమీని గతంలో రామ్ చరణ్, ఉపాసన సందర్శించారు. అంతేకాదు కొత్త సంవత్సర వేడుకల్లో సానియా, ఉపాసన, రామ్ చరణ్‌లు కలిసి ఎంజాయ్ చేసిన విషయం తెల్సిందే.దీనిపై మరింత చదవండి :