శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 20 జూన్ 2019 (12:48 IST)

బర్నింగ్ స్టార్ కొబ్బరి మట్ట వచ్చేస్తోంది.. (video)

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కొబ్బరి మట్ట సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా కోసం ఎప్పుడెప్పుడా అంటూ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న వేళ కొబ్బరిమట్టతో హిట్ కొట్టేందుకు సంపూర్ణేష్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. హృదయ కాలేయం సినిమాలో కామెడీతో ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టిన సంపూర్ణేష్ రూపక్ రొనాల్డ్‌సన్ దర్శకత్వంలో ఈ సినిమాలో నటించాడు. 
 
ఇందులో మూడు విభిన్న పాత్రలలో కనిపించబోతున్నాడు సంపూ కనిపిస్తాడు. 2015 మొదలైనా ఈ సినిమా ఇప్పటికి షూటింగ్ జరుపుకుంటునే ఉంది. ఈ గ్యాప్‌లో సంపూ రెండు మూడు సినిమాలు కూడా చేశాడు. అవేవి కూడా అంతగా మెప్పించలేకపోయ్యాయి. 
 
ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో సంపూ మూడు డిఫరెంట్స్ షేడ్స్‌లో కనిపిస్తూ తనదైన శైలిలో బిల్డప్ ఇస్తున్నాడు. ఇంతకుముందు రిలీజ్ చేసిన సాంగ్స్‌, టీజ‌ర్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ మూవీ పై చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ఇంకేముంది.. తాజా పోస్టర్ ద్వారా కొబ్బరి మట్ట జూలై 19వ తేదీన రిలీజ్ కానుందని చెప్పేశాడు.