ఆర్కే.నగర్ బైపోల్ : బాబాయ్‌కు మద్దతిచ్చే ప్రసక్తే లేదు : ఇళయరాజ కుమారుడు
చెన్నై, ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేస్తున్న తమ బాబాయ్ గంగై అమరన్‌కు మద్దతిచ్చే ప్రసక్తే లేదని సినీ సంగీత దర్శకుడు ఇళయరాజా కుమారుడు యువన్ శంకర్ రాజా స్పష్టం చేశారు.
చెన్నై, ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేస్తున్న తమ బాబాయ్ గంగై అమరన్‌కు మద్దతిచ్చే ప్రసక్తే లేదని సినీ సంగీత దర్శకుడు ఇళయరాజా కుమారుడు యువన్ శంకర్ రాజా స్పష్టం చేశారు.
ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న గంగై అమరన్... సినీ ప్రముఖులు, వ్యాపారుల మద్దతు కోరుతూ ఆయన ప్రచారం సాగిస్తున్నారు. ఇందులోభాగంగా, ఆయన సూపర్ స్టార్ రజనీకాంత్‌ను కూడా కలుసుకున్నారు. ఆ తర్వాత గంగై అమరన్‌కు రజనీ మద్దతు ఇచ్చారంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగగా, దాన్ని సూపర్ స్టార్ ఖండించారు.
ఈ నేపథ్యంలో.. యువన్ శంకర్ రాజా కూడా బాబాయ్‌కు మద్దతివ్వడం లేదని తేల్చి చెప్పారు. అయితే, ఆయన గెలిస్తే స్వాగతిస్తాను తప్ప, ఎలాంటి మద్దతూ ఇవ్వబోనని యువన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. కాగా, తన తండ్రి ఇళయరాజాను ఉద్దేశించి గంగై అమరన్ చేసిన విమర్శల కారణంగానే యువన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.