సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 25 మార్చి 2021 (17:56 IST)

ఈ హోళీకి మీ ఇంట 'రంగ్ దే ప్రేమ', 'మిఠాయి కొట్టు చిట్టమ్మ'తో రంగులు వెదజల్లడానికి వస్తుంది జీ తెలుగు

వసంత ఋతువులో వచ్చే తొలి వేడుక హోళీ. చలికి వీడ్కోలు పలికి హోళికా దహన కాంతులు హోళీ. రాధా కృష్ణుల ప్రేమ గీతాల గాన విభావరి హోళీ. విశ్వంలోని రంగులన్ని కలిసి చేసే కోలాహలమే హోళీ. ఇలాంటి హోళీని ఈసారి మరింత అందంగా మనముందుకు తీసుకొని రాబోతుంది జీ తెలుగు. 'రంగ్ దే ప్రేమ' అనే కార్యక్రమంతో ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రసారం అవుతుండగా, మార్చి 29 సోమవారం మధ్యాహ్నం 2:30 గంటలకు 'మిఠాయి కొట్టు చిట్టమ్మ' అనే సరికొత్త ధారావాహికతో మనముందుకు రాబోతుంది జీ తెలుగు.
 
'రంగ్ దే ప్రేమ' కార్యక్రమానికి యూత్ ఐకాన్ హీరో నితిన్ సెలబ్రిటీ గెస్ట్ గా రాబోతున్నారు. అతనితో కలిసి జీ తెలుగు నటీనటులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేయనున్నారు. అంతేకాకుండా ఈ హోళీని మరింత ఆహ్లాదకరంగా చేయడానికి వస్తున్నారు తెల్లవారితే గురువారం కాస్ట్. ఇంకా, త్రినయని హీరోయిన్ ఆషిక పదుకొనె తన కాబోయే భర్తతో మొదటిసారిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వీళ్ళతో పాటు మన జీ తెలుగు జంటలు మేఘన - సిద్ధార్థ్, నిరుపమ్- గోమతి, అనూష- ప్రతాప్, ఆకర్ష్- భూమి, కల్కి- పూజ, ఆషిక- చందు ఎన్నో రంగులతో అందరిని అలరించనున్నారు. ఈ కార్యక్రమం మార్చి 28 సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానుంది.
 
అప్పుడే సంబరాలు అయిపోయాయి అనుకోకండి, ఇంకా ఉన్నాయి. ఎప్పుడు కూడా జీ తెలుగు బాంధవ్యాలు మరియు బంధుమిత్రుల ప్రేమానురాగలను వారి కథలో చక్కగా తెలుపుతుంది. ఈసారి కూడా అలాంటి ఒక కథతో "మిఠాయి కొట్టు చిట్టమ్మ" అనే ధారావాహికతో మనముందుకు వస్తుంది. తెలుగు టెలివిజన్ లోనే తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న వేణుగోపాల్ ఈ సీరియల్ కి దర్శకత్వం వహిస్తున్నా రు. చిట్టమ్మ (అంజనా శ్రీనివాస్) ఇల్లు, అమ్మ నాన్న మరియు తన మిఠాయి కొట్టే తన జీవితం. అలాంటి చిట్టమ్మ, కాంతమ్మ గారి కోడలు అవుతుంది. కాంతమ్మ రాజకీయాల్లో ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకునే మనస్తత్వం ఉన్న వారు. మరి కాంతమ్మ - చిట్టమ్మ ఎవరు ఎవరిని మారుస్తారు? బంధాలే ప్రపంచంగా బ్రతుకుతున్న చిట్టమ్మ, కాంతమ్మ ఇంటిని మార్చగలదా లేక తానే మారిపోతుందా? తెలుసుకోవాలంటే మార్చి 29 మధ్యాహ్నం 2: 30 గంటలకు మీ జీ తెలుగు లో తప్పక చూడండి.