మంగళవారం, 8 జులై 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. రాబోయే చిత్రాలు
Written By DV
Last Modified: సోమవారం, 4 జనవరి 2016 (16:52 IST)

జ‌న‌వ‌రి 10న‌ రాజ్‌తరుణ్ ‘సీతమ్మ అందాలు-రామయ్య సిత్రాలు’

ఉయ్యాల జంపాలా, సినిమా చూపిస్త మావ, కుమారి 21ఎఫ్  చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను పూర్తిచేసి క్రేజీస్టార్‌గా మారిన యువ కథానాయకుడు రాజ్‌తరుణ్ నటిస్తున్న మరో క్రేజీ చిత్రం ‘సీతమ్మ అందాలు-రామయ్య సిత్రాలు’. షూటింగ్‌ను పూర్తిచేసుకొని, నిర్మాణానంతర పనులను శరవేగంగా జరుపుకుంటోన్న ఈ చిత్రానికి శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకుడు. శ్రీశైలేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీమతి పూర్ణిమ ఎస్‌బాబు సమర్పణలో ఎస్.శైలేంద్రబాబు, కెవీ శ్రీధర్ రెడ్డి, హరీష్ దుగ్గిశెట్టి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
ఈ సందర్భంగా నిర్మాతలు చిత్ర విశేషాలను తెలియజేస్తూ ‘ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో సున్నితమైన భావోద్వేగాలకు, వినోదానికి పెద్దపీట వేశాం. రాజ్‌తరుణ్ పాత్ర సరికొత్తగా వుంటుంది. ఈ చిత్రంతో అర్తన అనే నూతన హీరోయిన్ తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం కాబోతుంది. నవ్యమైన కథ, కథనాలతో రూపొందుతున్న ఈ చిత్రంలోని పతాక సన్నివేశాలను భారీఖర్చుతో చిత్రీకరించాం. 
 
చిత్రంలో పతాక సన్నివేశాలు హైలైట్‌గా వుంటాయి. తప్పకుండా ఈ చిత్రం రాజ్‌తరుణ్ సెకండ్ హ్యాట్రిక్‌కు శ్రీకారంలా వుంటుంది. జనవరి 10న‌ ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియోను విడుదల చేసి, జనవరి 29న‌ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకరావడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఇటీవల విడుదలైన టీజర్‌కు చక్కటి స్పందన వస్తోంది. తప్పకుండా చిత్రం కూడా అన్ని వర్గాల ఆదరణ పొందుతుందనే నమ్మకం వుంది’ అని తెలిపారు. 
 
రాజ్‌తరుణ్, అర్తన, రణధీర్, రాజా రవీంద్ర, ఆదర్శ్, షకలక శంకర్, మధునందన్, విజయ్, జోగినాయుడు, సురేఖావాణి, శ్రీలక్ష్మి, హేమ, రత్నసాగర్, నవీన్, భార్గవి తదితరలు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్, పాటలు: సుద్ధాల అశోక్‌తేజ,  రామజోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల, వనమాలి, కృష్ణచైతన్య, ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్, కెమెరా: విశ్వ, ఆర్ట్: జేవీ, అడిషనల్ డైలాగ్స్: అనీల్ మల్లెల, ప్రొడక్షన్ కంట్రోలర్: కొర్రపాటి వెంకటరమణ, సమర్పణ; శ్రీమతి పూర్ణిమ ఎస్‌బాబు, కథస్కీన్‌ప్లే--దర్శకత్వం: శ్రీనివాస్ గవిరెడ్డి.