సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. రాబోయే చిత్రాలు
Written By srinivas
Last Modified: శనివారం, 28 జులై 2018 (17:25 IST)

సుశాంత్ చి.ల.సౌ ట్రైల‌ర్ అదిరింది... సినిమా బాగానే ఆడేస్తుందట(video)

అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ న‌టించిన చిత్రం చి.ల.సౌ. ఈ చిత్రానికి హీరో రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ చిత్రాన్ని అన్న‌పూర్ణ స్టూడియోస్ సంస్థ రిలీజ్ చేస్తుంది. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ & టీజ‌ర్‌కి అనూహ్య‌మైన స్పంద‌న వ‌చ్చింది. ఇప్పుడు టా

అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ న‌టించిన చిత్రం చి.ల.సౌ. ఈ చిత్రానికి హీరో రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ చిత్రాన్ని అన్న‌పూర్ణ స్టూడియోస్ సంస్థ రిలీజ్ చేస్తుంది. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ & టీజ‌ర్‌కి అనూహ్య‌మైన స్పంద‌న వ‌చ్చింది. ఇప్పుడు టాలీవుడ్ కింగ్ నాగార్జున చి.ల.సౌ ట్రైల‌ర్‌ని రిలీజ్ చేసారు. ఈ ట్రైల‌ర్‌కి చాలా మంచి స్పంద‌న ల‌భిస్తోంది. సుశాంత్ ఈ సినిమాతో స‌క్స‌స్ సాధించ‌డం ప‌క్కా అని టాక్ వినిపిస్తోంది. 
 
ఇక ట్రైల‌ర్ విష‌యానికి వ‌స్తే.. చాలా ఫ్రెష్‌గా ఫ‌న్‌గా ఉంది. యూత్‌కి క‌నెక్ట్ అవ్వ‌డం ఖాయం అనిపిస్తుంది. ఇక సుశాంత్ లుక్స్ యాక్టింగ్‌లో కూడా చాలా డిఫ‌రెన్స్ క‌నిపిస్తోంది. ఈ సినిమాతో సుశాంత్ అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటాడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అలాగే రాహుల్ ర‌వీంద్ర‌న్ ఫ‌స్ట్ మూవీ అయిన‌ప్ప‌టికీ యూత్ ప‌ల్స్ బాగా క్యాచ్ చేసాడ‌ని చెప్ప‌చ్చు. ఆగ‌ష్టు 3న ఈ సినిమాని గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. అంద‌రి అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టు చి.ల.సౌ స‌క్స‌ెస్ సాధిస్తుంద‌ని ఆశిద్దాం. చూడండి ఇక్కడ ట్రెయిలర్...