ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 24 నవంబరు 2023 (18:37 IST)

బొమ్మదేవర రామచంద్ర రావు రూపొందించిన మాధవే మధుసూదన సినిమా రివ్యూ

Rishiki Lokre - Tej Bommadewara
Rishiki Lokre - Tej Bommadewara
నాగార్జున, అనుష్కలకు మేకప్ మేన్ గా వున్న బొమ్మదేవర రామచంద్ర రావు నిర్మాతగా అనుష్కతో భాగమతి తీసి సక్సెస్ అయ్యారు. కానీ ఈ సారి ఆయన కుమారుడు తేజ్ బొమ్మదేవర హీరోగా పరిచయం చేస్తూ మాధవే మధుసూదన సినిమా నిర్మిస్తూ, దర్శకత్వం కూడా వహించారు. రిషికి లొక్రే‌ హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎలా ఉందో ఓ సారి చూద్దాం.
 
కథ
మాధవ్ (తేజ్ బొమ్మదేవర) తన స్నేహితులతో తిరుగుతూ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంటాడు. బాధ్యత లేని కొడుకుని చూసి బాధపడుతుంటారు తల్లిదండ్రులు. ఆఫీస్‌ బాధ్యతలు చూసుకోమని మాధవ్‌ను బెంగళూరుకు తల్లి (ప్రియ). తండ్రి (జయ ప్రకాష్) పంపిస్తారు.. అలా బెంగళూరుకు వెళ్లాల్సిన మాధవ్ వైజాగ్ ట్రైన్ ఎక్కి అరుకు చేరుతాడు. మార్గమధ్యంలో ఓ రైల్వే స్టేషన్‌లో అమ్మాయి (రిషికి లొక్రే)ని చూస్తాడు. కానీ ఆమె ఎవరికీ కనిపించదు. కేవలం మాధవకే కనిపిస్తుంది? అసలు ఆ అమ్మాయికి మాధవకి ఉన్న సంబంధం ఏంటి? ఆరాధ్య అంటూ ఆ అమ్మాయి వెనకాల ఎందుకు వెళ్తాడు? వీరిద్దరి మధ్య ఉన్న గతం ఏంటి? ప్రేమ కోసం ఈ ఇరువురు చేసిన త్యాగాలేంటి? అనేది కథ.
 
 సమీక్ష-
తేజ్ బొమ్మదేవర తన పరిధి మేరకు నాచురల్ గా నటన చూపించాడు. తను తీసుకున్న శిక్షణ పనికి వచ్చింది. ఇంకా నలిగితే నటుడిగా రాణిస్తాడు. డ్యాన్సులు, డైలాగ్ డెలివరీలో మంచి నటనను కనబర్చాడు. ఇక హీరోయిన్‌గా కనిపించిన రిషికి అందరినీ ఆకట్టుకుంటుంది. తెరపై చలాకీగా కనిపించింది. అందంగానూ కనిపించింది. హీరోయిన్ తండ్రిగా కనిపించిన బొమ్మదేవర రామచంద్ర రావు ఎమోషనల్ సీన్లతో ఏడిపిస్తాడు. ఫ్రెండ్స్ పాత్రలు  రవి (జోష్ రవి), శివ (శివ) అలరిస్తారు.
 
ఈ సినిమా టైటిల్ కు తగినట్లు  పాజిటివిటీ ఉందో సినిమాలోనూ అంతే పాజిటివిటీ ఉంది. ఎక్కడా వల్గారిటీని చూపించలేదు. అలాంటి సీన్ల జోలికి పోకుండా తనకేం కావాలో అది మాత్రమే తీశాడు దర్శకుడు. ఆ విషయంలో డైరెక్టర్‌ను మెచ్చుకోవాల్సిందే. కథ, కథనాలు ఎలా ఉన్నా కూడా వాటి నుంచి గాడి తప్పకుండా చూసుకున్నాడు.
 
అన్ని చిత్రాల్లో ప్రేమ ఉన్నా కూడా.. అన్ని ప్రేమ కథలు ఒకేలా ఉండవు. ప్రేమ అంటే సమస్యలు, సంఘర్షణలు కామన్. కానీ ఆ సమస్యలు, సంఘర్షణలు ఎవరితో.. ఎవరి మధ్య అన్నదే ఇంపార్టెంట్. ఈ సినిమాలో విలన్ అంటూ ప్రత్యేకంగా ఉండడు. విధి విలన్‌గా కనిపిస్తుంది. ప్రేయసికి ఇచ్చిన మాట కోసం ప్రియుడు ఏం చేశాడు? ఏం చేయగలడు.. ప్రియుడు లేకుండా ప్రేయసి ఎలా ఉంటుంది? అనేది చక్కగా చూపించారు.
 
ప్రథమార్దం కాస్త జాలీగా సాగుతుంది. ఎక్కడా బోర్ కొట్టించకుండా నడిపించినట్టు అనిపిస్తుంది. కానీ సెకండాఫ్ మాత్రం కొంచెం నీరసంగా, నిదానంగా సాగినట్టు కనిపిస్తుంది. సెకండాఫ్ కాస్త తగ్గించినా బాగుండేది. నిడివి సమస్య కూడా అక్కడే వచ్చినట్టుగా అనిపిస్తుంది. పాటలు వినడానికి, చూడటానికి బాగున్నాయి. మాటలు కొన్ని చోట్ల గుండెల్ని తాకేలా ఉన్నాయి. హీరో తేజ్ డాన్స్, ఫైట్స్ చేయటంలొ చాలా కష్ట పడ్డాడు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. కొత్త వాడైనా తన కొడుకుతో దర్శకుడు చేసిన ప్రయత్నం అబినందనీయం. ఇది ఏ మేరకు ఆదరణ పొందుతుందో ప్రేక్షకుల తీర్పును బట్టి వుంటుంది. వల్గారిటీ లేని సినిమా. కుటుంబంతో చూడతగ్గ చిత్రం.
రేటింగ్..2.75/5