బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 20 నవంబరు 2023 (10:05 IST)

మాధవే మధుసూదన చిత్రం ఫ్యామిలీ ఆడియెన్స్ చూసే సినిమా : బొమ్మదేవర రామచంద్రరావు

Suman-bommadevara and team
Suman-bommadevara and team
తేజ్ బొమ్మదేవర, రిషికి లొక్రే‌ జంటగా నటించిన సినిమా ‘మాధవే మధుసూదన’. ఈ చిత్రాన్ని సాయి రత్న క్రియేషన్స్ బ్యానర్ పై  నిర్మిస్తూ దర్శకత్వం వహించారు బొమ్మదేవర రామచంద్ర రావు. ఈ మూవీని బొమ్మదేవర శ్రీదేవి సమర్పిస్తున్నారు. ఈ నెల 24 ‘మాధవే మధుసూదన’ సినిమా థియేటర్స్ ద్వారా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.

ఈ సందర్భంగా  సుమన్ మాట్లాడుతూ -* ‘మాధవే మధుసూదన’ సినిమాను దర్శకుడు బొమ్మదేవర రామచంద్ర రావు చాలా క్లారిటీగా రూపొందించారు. ఆయనకు చాలా అనుభవం ఉంది. ఎంతోమంది దర్శకులను చూశారు. ప్రతి సీన్ తెరకెక్కించేప్పుడు బొమ్మదేవర రామచంద్ర రావు అనుభవం నాకు కనిపించింది. కెమెరామెన్ వాసు ప్రతి ఫ్రేమ్ ను చక్కగా పిక్చరైజ్ చేశారు. ఏ సినిమా బాగా రావాలన్నా డైరెక్టర్, స్టోరి, టెక్నీషియన్స్ కీలకం. ఈ సినిమాకు ఆ టీమ్ బాగా కుదిరింది. ఆర్టిస్టులు కూడా కొత్త వాళ్లు అయినప్పటికీ బాగా ప్రిపేర్ అయి నటించారు. ఈ సినిమాతో బొమ్మదేవర రామచంద్రరావు తన కొడుకు తేజ్ ను హీరోగా పరిచయం చేస్తున్నాడు. అతను మంచి హీరో అవుతాడు. డ్యాన్సులు, ఫైట్స్, ఎమోషన్, కామెడీ అన్ని ఎలిమెంట్స్ బాగా పర్ ఫార్మ్ చేస్తున్నాడు. అతనికి మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. హీరో తేజ్ వర్క్ షాప్స్ చేసి తన క్యారెక్టర్ లోని మ్యానరిజమ్స్, డైలాగ్స్ ఇంప్రెసివ్ గా చెప్పాడు. ఫాదర్ డైరెక్ట్ చేస్తున్నాడు అని కాకుండా ఒక డైరెక్టర్ దగ్గర వర్క్ చేస్తున్నట్లు ఎన్ని కరెక్షన్స్ చెప్పినా తేజ్ చేశాడు. హీరోయిన్ పర్ ఫార్మెన్స్ కూడా ఆకట్టుకుంటుంది. రామచంద్రరావు గారు మిగతా హీరోలతో కూడా సినిమాలు చేయాలి. వికాస్ చేసిన పాటలు చాలా బాగుంటాయి. ఫ్యామిలీ అంతా కలిసి చూడాల్సిన సినిమా ఇది. థియేటర్స్ కు వెళ్లి చూడమని కోరుతున్నా. అన్నారు.
 
 *దర్శక, నిర్మాత బొమ్మదేవర రామచంద్రరావు మాట్లాడుతూ -* సినిమా ఇండస్ట్రీలో నాకు 45 ఏళ్ల అనుభవం ఉంది. టచప్ బాయ్ నుంచి మేకప్ మెన్ గా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాను. నాగార్జున గారి దగ్గర పనిచేస్తున్నప్పుడు అందరు స్టార్ డైరెక్టర్స్ తో అనుబంధం ఏర్పడింది. వాళ్లు సీన్స్ ఎలా చేస్తున్నారు, ఏ షాట్ ఎలా పిక్చరైజ్ చేస్తున్నారు అనేది పరిశీలించేవాడిని. నాకు చిన్నప్పటి నుంచి డైరెక్షన్ చేయాలనే కోరిక ఉండటం ఇందుకు కారణం. నేను కూడా ఇలా ఏదో ఒకరోజు డైరెక్షన్ చేయాలని కోరుకున్నాను. మంచి కథ సిద్ధం చేసుకుని కొందరు హీరోలను అప్రోచ్ అయ్యాను. నేనే డైరెక్టర్, ప్రొడ్యూసర్ గా చేస్తానని చెప్పడంతో వాళ్లలో ఏవైనా సందేహాలు కలిగి ఉండొచ్చు. లేదా రిస్క్ ఎందుకని అనుకోవచ్చు. వాళ్లు సినిమా చేసేందుకు ముందుకు రాలేదు. అప్పుడు మా అబ్బాయినే హీరోగా పెట్టి సినిమా చేయాలనుకున్నాను. నేను వెళ్లి మా అబ్బాయి తేజ్ ను అడిగితే ..అతనికి కూడా మనసులో హీరో కావాలని ఉంది. కానీ నేను ఏమంటానో అని చెప్పడం లేదని తెలిసింది. అలా కాలేజ్ పూర్తయ్యాక ఏడాది పాటు ట్రైనింగ్ ఇచ్చి మా అబ్బాయి తేజ్ హీరోగా ఈ సినిమా స్టార్ట్ చేశాను. నేను ఆశించినట్లే అబ్బాయి బాగా పర్ ఫార్మ్ చేశాడు. హీరోయిన్ కూడా ఆకట్టుకునేలా నటించింది. మా సినిమాటోగ్రాఫర్ వాసు నేను అనుకున్నట్లుగా సీన్స్ తీశాడు. మ్యూజిక్ డైరెక్టర్ వికాస్ నాలుగు మంచి పాటలు ఇచ్చాడు. పాట సందర్భం తెలుసుకుని పర్పెక్ట్ గా ట్యూన్ చేశాడు. సినిమాలో ఎలాంటి వల్గారిటీ, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉండవు. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉంటుంది. మా సినిమా బాగా చేశామని మేము చెప్పుకోవడం కాదు మీరు చూసి రెస్పాన్స్ ఇస్తారని కోరుకుంటున్నాం. అన్నారు.
 
 *డైలాగ్స్ రైటర్ సుదర్శన్ మాట్లాడుతూ -* ‘మాధవే మధుసూదన’ చందమామ లాంటి ఒక అందమైన ప్రేమ కథ. ఇలాంటి లవ్ స్టోరీ తెలుగు తెరపై ఇప్పటిదాకా రాలేదు. సినిమాను రామచంద్రరావు గారు చక్కగా రూపొందించారు. కెమెరా, మ్యూజిక్, ఎడిటింగ్ ఇలా ప్రతి క్రాఫ్ట్ పనితనం సినిమాకు హైలైట్ అవుతుంది. ఈ సినిమాతో తేజ్ హీరోగా పేరు తెచ్చుకుంటాడు. హీరోయిన్ కు కూడా ఫేమ్ వస్తుంది. ఈ నెల 24న రిలీజ్ అవుతున్న ‘మాధవే మధుసూదన’ సినిమాను సకుటుంబంగా ప్రేక్షకులు చూస్తారని ఆశిస్తున్నా. అన్నారు.
 
 *యాక్టర్ నవీన్ నేని మాట్లాడుతూ -* ‘మాధవే మధుసూదన’ సినిమాలో నేను ఒక ఇంపార్టెంట్ రోల్ చేశాను. హీరో ఫ్రెండ్స్ గా మేము చేసిన సీన్స్ అన్నీ బాగా వచ్చాయి. ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన చంద్ర గారికి థ్యాంక్స్. ఆయనతో పనిచేస్తున్నప్పుడు మా స్కూల్ లో హెడ్ మాస్టర్ గుర్తొచ్చారు. సెట్ లో  అంత స్ట్రిక్ట్ గా ఉండేవారు. అయితే ఆయనతో మా అందరికీ మంచి అనుబంధం ఏర్పడింది. సినిమా అంతా ఎంజాయ్ చేస్తూ చేశాం. చంద్ర గారికి ఉన్న ఎక్సీపిరియన్స్ తెలుసు కాబట్టి ఫలానా హీరోలు వెయిట్ పెరగకుండా ఎలాంటి డైట్ తీసుకుంటారని అడిగేవాడిని. ఆయన సరదాగా చెప్పేవారు. హ్యాపీగా మూవీలో  జర్నీ చేశాం. ‘మాధవే మధుసూదన’మంచి మూవీ అవుతుంది. హీరోగా తేజ్ పేరు తెచ్చుకుంటాడు. అన్నారు.