శనివారం, 23 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 1 అక్టోబరు 2021 (11:04 IST)

సాయి ధరమ్ తేజ్ "రిపబ్లిక్" ఫస్టాఫ్ రివ్యూ రిపోర్ట్

దేవా కట్టా దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన రిపబ్లిక్ సినిమా శుక్రవారం రిలీజైంది. ఈ సినిమాను జి స్టూడియోస్, జేబీ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించాయి. సాయిధరమ్ తేజ్ నటనతో పాటు, రిపబ్లిక్ మూవీకి వారు పాజిటివ్ రివ్యూలు ఇచ్చారు. 
 
ఓవరాల్‌గా జనంలో మాత్రం రిపబ్లిక్ మూవీ పట్ల మిక్స్డ్ టాక్ వినిపిస్తుంది. కొందరు రిపబ్లిక్ మూవీ యావరేజ్ అంటుంటే, మరికొందరు మంచి సినిమా ఒకసారి చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత సీనియర్ నిర్మాతలు జె భగవాన్, జె పుల్లారావ్ రిపబ్లిక్ సినిమాను నిర్మించారు. ఇందులో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌గా నటించింది. రమ్యకృష్ణ, జగపతి బాబు కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే ఈ సినిమాపై సెలెబ్రిటీలే రివ్యూ ఇచ్చారు. తాజాగా ఫస్టాఫ్ రివ్యూ ఎలా వుందో తెలుసుకుందాం.. 
 
రిపబ్లిక్ ఫస్టాఫ్ రివ్యూ  
తూర్పు గోదావరి జిల్లాలో ఓ ప్రభుత్వ ఉద్యోగి కుమారుడు సాయి ధరమ్ తేజ్. చుట్టూ సమాజంలో చాలా అవకతవకలు జరుగుతున్న విషయాన్ని అతడు గమనిస్తాడు. వాటిని ఎదిరించాలని ఆ అవకతవకలను నిర్మూలించాలని భావిస్తాడు. ఓసారి ఓటేసేందుకు వెళ్తే సాయి ఓటును వేరే వ్యక్తి వేసేస్తాడు. అక్కడ నుంచి రియలైజ్ అయి మన చట్టం ఏంటి? రాజ్యాంగం ఏమిటి? అనే విధంగా సామాజాన్ని, వ్యవస్థను మార్చాలని ఐఏఎస్ అవుతాడు. 
 
తొలి ఇంటర్వూలోనే సెలెక్ట్ అవుతాడు. ఆ ఇంటర్వ్యూలో రకరకాల ప్రశ్నలేస్తుంటే.. ప్రజాస్వామ్యం ఎక్కడుంది.. వ్యవస్థ ఎక్కడుంది అంటూ అధికారులతో చెప్తాడు. ఇంకా రాజకీయ నాయకుల చేతిల్లో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందని.. వారి అధికారంతో ఎక్కడా అవకతవకలేనని చెప్తాడు. ఇందులో నేను మీరు కూడా రాజకీయ నేతలకు తలొగ్గాల్సిందేనని చెప్తాడు. ఇలా సాయి చెప్పిన విషయాలను ఇంటర్వ్యూ ద్వారా నచ్చిన అధికారులు కొత్త నిర్ణయం తీసుకుంటారు. 
 
సాయిని సెలెక్ట్ చేసి అదే వూరుకు కలెక్టర్‌గా నియమిస్తారు. అక్కడ గుణ అనే రౌడీతో ఇతనికి సమస్యలు ఎదురవుతాయి. ఇతడు రాజకీయ నాయకుడు కావడంతో అతనితో యుద్ధానికి సై అంటాడు. రాజ్యాంగంలో ఏ ప్రాంతానికి వెళ్లినా రాజకీయ నాయకులు కలెక్టర్లను తీసేసే అధికారం కలిగివుంటారు. కానీ తొలిసారిగా అలా కాకుండా యూపీఎస్సీ ఈ సినిమా ద్వారా కొత్త ప్రయోగం చేస్తుంది. 
 
సాయిపై ఏ రాజకీయ నేత అధికారం ప్రయోగించకుండా యూపీఎస్సీనే అతనిని తొలగించే విధంగా చట్టం తెస్తుంది. ఈ ప్రయోగం ప్రకారం కలెక్టర్ సాయిపై ఏ రాజకీయ వ్యక్తి అధికారం చెల్లదంటూ యూపీఎస్సీ పేర్కొంటుంది. దీంతో సాయి తన ప్రాంతానికి పవర్ ఫుల్ కలెక్టర్‌లో బాధ్యతలు చేపడుతాడు.