ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By pnr
Last Updated : మంగళవారం, 1 ఆగస్టు 2017 (11:43 IST)

లైఫ్‌లో ఎంతకష్టమొచ్చినా ప్రేమను వదులుకోను.. : 'జయ జానకి నాయక' ట్రైలర్

"లైఫ్‌లో కష్టమొచ్చిన ప్రతి సారీ లైఫ్‌ను వదులుకోము. కానీ, ప్రేమని మాత్రం వదిలివేస్తాము. నేను వదలను. ఎందుకంటే నేను ప్రేమించా". అంటున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఈ డైలాగ్ సోమవారం రాత్రి రిలీజ్ చేసిన

"లైఫ్‌లో కష్టమొచ్చిన ప్రతి సారీ లైఫ్‌ను వదులుకోము. కానీ, ప్రేమని మాత్రం వదిలివేస్తాము. నేను వదలను. ఎందుకంటే నేను ప్రేమించా". అంటున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఈ డైలాగ్ సోమవారం రాత్రి రిలీజ్ చేసిన 'జయ జానకి నాయక' చిత్రంలో ఉంది. 
 
బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హీరో సాయి శ్రీనివాసన్‌కి మాస్ ఆడియన్స్ లోనే కాదు .. యూత్‌లోను క్రేజ్ ఏర్పడేలా గట్టి ప్రయత్నమే చేసినట్టు కనిపిస్తోంది. "ఎవరున్నా లేకున్నా .. ఎవరొచ్చినా రాకున్నా .. నీకు నేనున్నా" అంటూ కథానాయికతో హీరో చెప్పే డైలాగ్ యూత్‌ను ఒక రేంజ్‌లో ఆకట్టుకునేదిలా వుంది.
 
లవ్ .. రొమాన్స్ .. యాక్షన్ .. ఎమోషన్ కలయికగా ఈ ట్రైలర్‌ను కట్ చేశారు. రకుల్ .. కేథరిన్ గ్లామర్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణలా కనిపించేలా ఉంది. రిషి పంజాబి ఫోటోగ్రఫీ .. దేవిశ్రీ సంగీతం .. బోయపాటి టేకింగ్ ప్రధాన బలంగా అనిపిస్తున్నాయి. ఈ చిత్రం ఈనెల 11వ తేదీన విడుదల కానుంది.