గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By pnr
Last Updated : శుక్రవారం, 1 సెప్టెంబరు 2017 (20:41 IST)

'పెళ్లి చూపులు' డైరెక్టర్ తాజా చిత్రం ''మెంటల్ మదిలో'' (Trailer)

యువ కథానాయకుడు శ్రీవిష్ణు హీరోగా 'పెళ్లి చూపులు' నిర్మాత రాజ్ కందుకూరి నిర్మిస్తున్న తాజా చిత్రం మెంటల్ మదిలో (మనవి ఆలకించరాదటె! అనేది ట్యాగ్ లైన్). ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు

యువ కథానాయకుడు శ్రీవిష్ణు హీరోగా  'పెళ్లి చూపులు' నిర్మాత రాజ్ కందుకూరి నిర్మిస్తున్న తాజా చిత్రం మెంటల్ మదిలో (మనవి ఆలకించరాదటె! అనేది ట్యాగ్ లైన్). ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. 
 
ఈ సినిమా ద్వారా 'నివేతా పేతురాజ్' కథానాయికగా తెలుగు వెండితెరకు పరిచయమవుతోంది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్‌ ప్రముఖ నిర్మాత డి. సురేశ్ బాబు విడుదల చేశారు. 
 
నాయకా నాయికల మధ్య ప్రేమ .. ఘర్షణకి సంబంధించిన సన్నివేశాలపై ఈ ట్రైలర్‌‌ను కట్ చేశారు. ట్రైలర్ ద్వారా కంటెంట్‌ను చెబుతూనే ఆసక్తిని రేకెత్తించారు. యూత్‌కి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుందనే విషయం ఈ ట్రైలర్‌తో అర్థమైపోతోంది. త్వరలోనే ఆడియోను రిలీజ్ చేసి .. అదే రోజున సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామని నిర్మాత వెల్లడించారు.