Daily Horoscope
✕

"ఒరేయ్ బుజ్జిగా" అంటున్న ఆ ఇద్దరు హీరోయిన్లు (ట్రైలర్)

Written By ఠాగూర్
Updated: సోమవారం, 28 సెప్టెంబరు 2020 (18:10 IST)
టాలీవుడ్ యూత్ స్టార్ రాజ్ తరుణ్, మాళవికా నాయర్, హెబ్బా పటేల్ నటిస్తున్న తాజా చిత్రం ఒరేయ్ బుజ్జిగా. ఈ చిత్రానికి విజయ్‌ కుమార్‌ కొండా దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కె.కె.రాధామోహన్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. 
 
గాంధీజయంతి సందర్భంగా అక్టోబర్‌ 2న ఆహా ఓటీటీ ద్వారా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానున్నది. కుటుంబ విలువలతో ముడిపడిన యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొంద‌గా, తాజాగా చిత్ర ట్రైల‌ర్ విడుద‌లైంది. అక్కినేని నాగ చైత‌న్య త‌న ట్విట్ట‌ర్ ద్వారా ఒరేయ్ బుజ్జిగా చిత్ర ట్రైల‌ర్ రిలీజ్ చేశారు. 
 
ఈ ట్రైలర్ చూస్తుంటే మ‌న‌ల్ని నవ్విస్తూనే మనసుల్ని కదిలించే భావోద్వేగాలుంటాయని తెలుస్తుంది. రాజ్‌తరుణ్‌, మాళవికా నాయర్‌ కెమిస్ట్రీ ఆకట్టుకునేలా ఉంది. వాణీ విశ్వనాథ్‌, నరేష్‌, పోసానికృష్ణ మురళి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం అనూప్‌ రూబెన్స్ అందించారు.
 

అన్నీ చూడండి

దేశంలో బుల్లెట్ రైలు ట్రయల్ రన్‌కు ముహూర్తం ఖరారు : మంత్రి అశ్వినీ వైష్ణవ్

పిఠాపురం జనసేనలో అసమ్మతి సెగలు - ఎంపీ పీఏపై దాడికి యత్నం?

ఎన్వీడియా బోర్డు సంచలన నిర్ణయం... సీఈవోగా మళ్లీ జెన్సన్ హువాంగ్

2029కి సిద్ధమవుతున్న కూటమి తురుపుముక్కలు, స్థానిక సంస్థల్లో యువ నేతలు

క్యాన్సర్ మందుల దందా.. 15,000 మందికి పైగా రోగుల మోసం.. వ్యక్తి అరెస్ట్

అన్నీ చూడండి

క్యాన్సర్ స్క్రీనింగ్, ముందస్తు గుర్తింపు సేవలను ప్రజల ఇంటి వద్దకే తీసుకువస్తోన్న మీనాక్షి ఎనర్జీ

శ్వాసకోశ సమస్యలను అరికట్టే మూలికలు, ఏంటవి?

డాక్టర్ శ్రీవర్మ'స్ వెల్నెస్‌కు పాలీహెర్బల్ యాంటీ డయాబెటిక్ ఫార్ములా : ఎస్ఆర్ఎంటీ వెల్లడి

సిమ్స్ ఆస్పత్రిలో ఆసియాలోనే తొలిసారి : పదేళ్ల బాలుడికి కృత్రిమ అవయవంతో ప్రొస్థెటిక్ గ్రాఫ్ట్

చెన్నై కావేరీ ఆస్పత్రిలో రికార్డు స్థాయిలో హైపెక్ కీమోథెరపీ చికిత్సలు

తర్వాతి కథనం
Show comments