సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: సోమవారం, 14 అక్టోబరు 2019 (19:34 IST)

రాజ్‌తరుణ్‌ ‘ఒరేయ్‌.. బుజ్జిగా’ వ‌చ్చేది ఎప్పుడు?

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ కథానాయకుడిగా శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకం పై కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్న కంప్లీట్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఒరేయ్‌.. బుజ్జిగా’. ఈ చిత్రానికి సంబంధించిన రెండో షెడ్యూల్‌ అక్టోబర్‌ 12 నుంచి ప్రారంభమైంది. 
 
ఈ సందర్భంగా నిర్మాత కె.కె.రాధామోహన్‌ మాట్లాడుతూ... ”ఫస్ట్‌ షెడ్యూల్‌ పూర్తయింది. రెండో షెడ్యూల్‌  ప్రారంభించాం. నాన్‌స్టాప్‌గా ఈ షెడ్యూల్‌ జరుగుతుంది అని చెప్పారు.
 
రాజ్‌ తరుణ్‌ ఎనర్జీకి తగిన క్యూట్‌ లవ్‌స్టోరీ ఇది. సెన్సిటివ్‌ లవ్‌స్టోరీ ‘గుండెజారి గల్లంతయ్యిందే’ వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని రూపొందించిన కొండా విజయ్‌కుమార్‌గారు మరో డిఫరెంట్‌ స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 
 
నంద్యాల రవి చాలా మంచి డైలాగ్స్‌ రాశారు. ఈ చిత్రంలో వాణీవిశ్వనాథ్ గారు కీలక పాత్ర పోషిస్తున్నారు. తప్పకుండా మా ‘ఒరేయ్‌.. బుజ్జిగా’ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ఇది మా బేనర్‌లో మరో సూపర్‌హిట్‌ సినిమా అవుతుంది అని నిర్మాత రాధామోహ‌న్ అన్నారు.
 
యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌, మాళవిక నాయర్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో వాణీ విశ్వనాథ్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళి ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. ఇటీవ‌ల కాలంలో రాజ్ తరుణ్ సినిమాలు ఆశించిన స్ధాయిలో ఆక‌ట్టుకోవ‌డం లేదు. మ‌రి... ఈ సినిమాతో అయినా రాజ్ త‌రుణ్ కి స‌క్స‌స్ వ‌స్తుందో లేదో చూడాలి.