మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By
Last Updated : శుక్రవారం, 14 డిశెంబరు 2018 (14:35 IST)

నిన్నెందుకు ప్రేమించాలంటున్న సాయి పల్లవి : "పడి పడి లేచె మనసు" ట్రైలర్

యువ హీరో శర్వానంద్, ఫిదా భామ సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం పడి పడి లేచె మనసు. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి, ప్రసాద్ చుక్కపల్లి నిర్మిస్తున్నారు. ఈనెల 21వ తేదీన ఈ చిత్రం విడుదలకానుంది. 
 
రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం రెండు మనసుల ప్రేమ ప్రయాణానికి అందమైన దృశ్యరూపంగా మలిచారు. కోల్‌కతా పట్టణ నేపథ్యంలో హృద్యమైన ప్రేమకథగా దర్శకుడు హను రాఘవపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 
 
శర్వానంద్ పాత్ర సరికొత్త పంథాలో సాగుతుంది. మురళీశర్మ, సునీల్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, ప్రియారామన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం విశాల్ చంద్రశేఖర్ అందిస్తున్నారు. తాజాగా చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో అన్ని ర‌కాల ఎమోష‌న్స్‌ని చాలా చ‌క్క‌గా చూపించారు. ఈ చిత్రంలో సాయి పల్లవి డాక్టరుగా, శర్వానంద్ ఫుట్‌బాల్ ప్లేయర్‌గా కనిపించనున్నారు.