మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 25 జులై 2018 (12:56 IST)

శర్వానంద్, సాయిపల్లవిల ''పడి పడి లేచే మనసు''.. డిసెంబర్ 21న రిలీజ్

శర్వానంద్, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ''పడి పడి లేచే మనసు''. ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ సినిమాను డిసెంబర్ 21వ తేదీన విడుదల చేయనున్నట్లు సినీ యూనిట్ ప్రకటిం

శర్వానంద్, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ''పడి పడి లేచే మనసు''. ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ సినిమాను డిసెంబర్ 21వ తేదీన విడుదల చేయనున్నట్లు సినీ యూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా రిలీజ్ డేట్‌కు సంబంధించి ఓ పోస్టర్‌ని సోషల్ మీడియాలో యూనిట్ రిలీజ్ చేసింది. 
 
ఈ స్టిల్‌లో ఇందులో హీరో, హీరోయిన్‌ను ఎత్తుకుని వున్నాడు. ఇద్దరి మధ్యన మంచి లవ్ స్టోరీ ఉన్నట్లు పోస్టర్‌ను చూస్తే అర్థం చేసుకోవచ్చు. సినిమా రిలీజ్‌పై సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో సంతోషం పంచుకున్న హీరో శర్వానంద్.. డిసెంబర్ 21న కలుద్దామని ట్విట్ చేశాడు.
 
ధాకర్‌ చెరుకూరి, ప్రసాద్‌ చుక్కపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌‌గా నటిస్తోంది. కొల్‌ కతాలో సాగే ఈ ప్రేమకథ షూటింగ్‌ పూర్తి కావచ్చిందని.. త్వరలో నేపాల్‌‌లో జరగనున్న షెడ్యూల్‌ లో షూటింగ్‌ మొత్తం పూర్తవుతుందని యూనిట్ వెల్లడించింది. విశాల్‌ సంగీతమందిస్తున్న ఈ సినిమాలో మురళీశర్మ కీలక పాత్రలో నటిస్తుండగా సునీల్ గెస్ట్ రోల్‌ లో అలరించనున్నాడు. 
 
అయితే ఇటీవల వచ్చిన తేజ్ ఐ లవ్ యూ లోని ఓ పాయింట్‌కి .. ఈ సినిమాలోని పాయింట్‌కి మధ్య దగ్గర పోలికలు వున్నాయనే టాక్ వచ్చింది. దాంతో కథలో మార్పులు చేసే పనిలో హను రాఘవపూడి ఉన్నాడనీ .. విడుదల విషయంలో జాప్యం జరగవచ్చనే వార్తలు వస్తున్నాయి.