'పడి పడి లేచె మనసు' మేకింగ్ వీడియో (Video)
టాలీవుడ్ యువ హీరో శర్వానంద్ - ఫిదా భామ సాయిపల్లవి జంటగా నటించే చిత్రం పడి పడి లేచె మనసు. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సుధాకర్ చెరుకూరి, ప్రసాద్ చుక్కపల్లిలు నిర్మాతలు. వచ్చే డిసెంబర్ 21వ తేదీన ఈ చిత్రం విడుదలకానుంది.
రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం రెండు మనసుల ప్రేమ ప్రయాణానికి అందమైన దృశ్యరూపంగా ఉంటుంది. కోల్‌కతా పట్టణ నేపథ్యంలో హృద్యమైన ప్రేమకథగా దర్శకుడు హను రాఘవపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శర్వానంద్ పాత్ర సరికొత్త పంథాలో సాగుతుంది.
ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను ఇటీవల విడుదల చేయగా, మంచి స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం మేకింగ్ వీడియో విడుదల చేశారు. ఇందులో సన్నివేశాలని బట్టి చూస్తుంటే సినిమా షూటింగ్ ఎంత సరదాగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. కాగా ఈ సినిమాలో సాయి పల్లవి డాక్టర్‌గా, శర్వా ఫుట్‌బాల్ ప్లేయర్‌గా కనిపించనున్నారు.