శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By
Last Updated : బుధవారం, 17 అక్టోబరు 2018 (18:52 IST)

''సాహో'' నుంచి.. యాక్షన్ ఎపిసోడ్‌ మేకింగ్ వీడియో వచ్చేస్తోందా?

బాహుబలి హీరో, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న అడ్వంచరస్ యాక్షన్ థ్రిల్లర్ ''సాహో'' సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దుబాయ్‌లో షూటింగ్ ముగించుకున్న ఈ సినిమా భారీ యాక్షన్ సీన్స్.. హాలీవుడ్‌కి చెందిన ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ పర్యవేక్షణలో జరుగుతున్నాయి. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కిస్తున్నాడు. 
 
బాహుబలితో ప్రభాస్ పాపులర్ స్టార్ కావడంతో సాహో సినిమాను ప్రేక్షకుల అంచనాలకు అనుగుణంగా రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 23వ తేదీన ప్రభాస్ పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, 'సాహో' నుంచి ఏదో ఒక ఐటమ్‌ను రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. 
 
సాహో షూటింగ్‌లో భాగంగా దుబాయ్‌లోని 'బూర్జ్ ఖలీఫా' ప్రాంతంలో రూ.25 కోట్లతో ఒక యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరించారు. ఈ సినిమాకి ఈ యాక్షన్ సీన్ హైలైట్‌గా నిలవనుందని టాక్. ఈ యాక్షన్ ఎపిసోడ్‌కి సంబంధించిన మేకింగ్ వీడియోను ప్రభాస్ పుట్టిన రోజున విడుదల చేయవచ్చనే టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే.. మేకింగ్ వీడియోతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగే అవకాశం వున్నట్లు తెలుస్తోంది.