ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 1 అక్టోబరు 2018 (16:07 IST)

నేను గర్భవతిని.. చెప్పిందెవరు..?

తాను గర్భవతినని.. పుట్టిన రోజు సందర్భంగా స్విట్జర్లాండ్ టెన్నిస్ స్టార్ మార్టినా హింగిస్ ప్రకటించింది. తన 38వ పుట్టిన రోజు సందర్భంగా వచ్చే బర్త్ డే నాటికి తమ కుటుంబంలో ముగ్గురు సభ్యులుంటారని తెలిపింది

తాను గర్భవతినని.. పుట్టిన రోజు సందర్భంగా స్విట్జర్లాండ్ టెన్నిస్ స్టార్ మార్టినా హింగిస్ ప్రకటించింది. తన 38వ పుట్టిన రోజు సందర్భంగా వచ్చే బర్త్ డే నాటికి తమ కుటుంబంలో ముగ్గురు సభ్యులుంటారని తెలిపింది. హరాల్డ్ లీమన్ అనే మాజీ స్పోర్ట్స్ ఫిజీషియన్‌ను హింగిస్ పెళ్లాడిన సంగతి తెలిసిందే.


ఈ నేపథ్యంలో తన పుట్టిన రోజు వేడుకలను ఇన్నాళ్లు తన భాగస్వామితో జరుపుకుంటున్నానని.. ఈ సెలెబ్రేషన్స్‌ను జంటగా జరుపుకోవడం ఇదే చివరిసారి అని చెప్పేందుకు సంతోషిస్తున్నట్లు మార్టినా వెల్లడించింది. 
 
తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ధన్యవాదాలని తెలిపింది. కాగా ఐదుసార్లు గ్రాండ్‌స్లామ్ ఛాంపియన్‌గా నిలిచిన హింగిస్.. 209 వారాల పాటు సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగింది.

2003లో 22ఏళ్ల వయస్సులో తొలిసారి రిటైర్మెంట్ తీసుకున్న ఈమె 2007 నవంబరులో ఏర్పడిన గాయం కారణంగా డోపింగ్ టెస్టులో కొకైన్ ఆనవాళ్లు బయటపడటంతో మరోసారి 2018లో రిటైర్మెంట్ తీసుకుంది.