బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : సోమవారం, 16 ఆగస్టు 2021 (08:41 IST)

శ్రీముఖిలో ఎన‌ర్జీ ఉంది.‘క్రేజీ అంకుల్స్’ ప్రీ రిలీజ్ లో అన‌సూయ‌

crazy uncles pre-release
యాంకర్ శ్రీముఖి, సింగర్ మనో, నటులు రాజా రవీంద్ర, భరణి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘క్రేజీ అంకుల్స్’. ఈ సత్తిబాబు దర్శకత్వంలో గుడ్ సినిమా గ్రూప్స్, గ్రీన్ మెట్రో మూవీస్, శ్రీవాస్ 2 క్రియేటివ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగస్ట్ 19న ఈ సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమంలో యాంకర్ ప్రదీప్, అనసూయ బిగ్ టికెట్‌ను విడుదల చేశారు. కె.ఎస్.రామారావు, రైటర్ కోన వెంకట్ ట్రైలర్‌ను విడుదల చేశారు. 
 
ఈ సందర్భంగా అన‌సూయ  భ‌ర‌ద్వాజ్ మాట్లాడుతూ ‘‘శ్రీముఖి, శ్రీవాస్‌, శ్రేయాస్ శ్రీను వంటి ఫ్రెండ్స్ కోసం ఇక్క‌డ‌కు వ‌చ్చాను. శ్రీను నిర్మాత‌గా ఇంకా మంచి స‌క్సెస్ కావాలి. శ్రీముఖిలో మంచి ఎన‌ర్జీ ఉంటుంది. త‌న‌కు ఇదొక కొత్త ప్రారంభం కావాలి. శ్రీవాస్‌గారు, స‌త్తిబాబుగారు, రాజా రవీంద్ర‌గారు, మ‌నోగారు స‌హా అంద‌రికీ కంగ్రాట్స్. ఆగ‌స్ట్ 19న నేను సినిమాను థియేటర్స్‌లో ఎంజాయ్ చేయ‌బోతున్నాను’’ అన్నారు.
మ్యూజిక్ డైరెక్ట‌ర్ ర‌ఘుకుంచె మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలో రెండు పాట‌లు చేశాను. యాబై ఏళ్లు పైబ‌డ్డ అంకుల్స్ స‌ర‌దాగా ఉన్న‌ప్పుడు, చిల్ అయ్యేట‌ప్పుడు డాన్స్ చేయ‌డానిక‌ని ఓ సాంగ్‌ను కూడా కంపోజ్ చేశాను. లాక్‌డౌన్ స‌మ‌యంలో వాట్స‌ప్‌ల ద్వారానే మాట్లాడుకుంటూ  పాటలను పూర్తి చేశాం’’ అన్నారు.
 
రాజా రవీంద్ర మాట్లాడుతూ, శ్రీముఖి.చ‌క్క‌గా యాక్ట్ చేశారు. మ‌నోగారు నాకు బ్ర‌ద‌ర్‌లాంటివారు. ఆయ‌న‌తో క‌లిసి న‌టించడం హ్యాపీ. భ‌ర‌ణి మ‌రో అంకుల్ పాత్ర‌లో న‌టించాడు. మేం ముగ్గురం ప్రేక్ష‌కుల‌ను ఆగ‌స్ట్ 19న న‌వ్విస్తాం’’ అన్నారు.
 
మ‌నో మాట్లాడుతూ ‘‘రాజా రవీంద్రతో కలిసి యాక్ట్ చేయడం హ్యాపీ. చాలా ఎంజాయ్ చేస్తూ న‌టించాం. శ్రీవాస్‌గారు, శ్రీనుగారు నాకు మంచి వేషం ఇచ్చారు. స్టేజ్‌పై శ్రీముఖిని చూడ‌టానికి, ఈ సినిమాలో పూర్తి భిన్న‌మైన పాత్ర‌లో న‌టించింది. ఫుల్ ఎన‌ర్జిటిక్ పాత్ర‌లో న‌టించారు. స‌త్తిబాబుగారు సినిమాను చ‌క్క‌గా తెర‌కెక్కించారు. ఆగ‌స్ట్ 19న సినిమా విడుద‌ల‌వుతుంది. సినిమా ప్రేక్ష‌కుల‌ను బాగా ఎంటర్‌టైన్ చేస్తుంది’’ అన్నారు.
 
ప్రదీప్ మాచిరాజు మాట్లాడుతూ ‘‘క్రేజీ అంకుల్స్ ప్రారంభం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు నాకు పూర్తిగా తెలుసు. శ్రేయాస్ శ్రీనుగారు చేసిన ఈ సినిమా మంచి స‌క్సెస్ కావాలి. శ్రీవాస్‌గారికి కూడా కంగ్రాట్స్‌. మ‌నోగారు, రాజా ర‌వీంద్ర‌గారు స‌హా ఇత‌ర టీమ్ స‌భ్యుల‌కు ఆల్ ది బెస్ట్‌. శ్రీముఖి... మా రాముల‌మ్మ‌.. త‌ను ఎన‌ర్జిటిక్‌. త‌నకొక యూనిక్ స్టైల్ ఉంటుంది. త‌నొక బ్రాండ్‌. క్రేజీనెస్‌ను అలాగే కొనసాగించాల‌ని కోరుకుంటున్నాను. ఆగ‌స్ట్ 19న థియేటర్స్‌లో క‌లుద్దాం’’ అన్నారు.
 
శ్రీముఖి మాట్లాడుతూ ‘‘క్రేజీ అంకుల్స్ సినిమాను ముందుగా ఓటీటీ కోసమే రెడీ చేశాం. అయితే ఇప్పుడు థియేట‌ర్స్ ఓపెన్ కావ‌డంతో ఆగ‌స్ట్ 19న మా సినిమాను థియేట‌ర్స్‌లో విడుద‌ల చేస్తున్నాం. శ్రీనుగారు, శ్రీవాస్‌గారు, అశోక్ స‌హా ఈ సినిమా నిర్మాత‌ల‌కు మంచి లాభాల‌ను తెచ్చి పెట్టాల‌ని కోరుకుంటున్నాను. సినిమాను స‌త్తిబాబుగారు చాలా త్వ‌ర‌గా పూర్తి చేశారు. రాజార‌వీంద్ర‌గారు, మ‌నోగారు, భ‌ర‌ణిగారితో క‌లిసి ప‌నిచేయ‌డం చాలా ఫ‌న్‌గా ఉండింది. ర‌ఘుకుంచెగారు చాలా మంచి సంగీతాన్ని అందించారు. ఆగ‌స్ట్ 19న థియేట‌ర్స్‌లో క‌లుద్దాం’’ అన్నారు.
 
నిర్మాత శ్రేయాస్ శ్రీను మాట్లాడుతూ ‘‘మా క్రేజీ అంకుల్స్ సినిమాను ఆగ‌స్ట్ 19న విడుద‌ల చేస్తున్నాం. ఈ రిలీజ్‌కు స‌పోర్ట్ చేస్తున్న గీతా ఆర్ట్స్‌, యూవీ క్రియేష‌న్స్‌, దిల్‌రాజుగారికి స్పెష‌ల్ థాంక్స్‌. ఓటీటీలో రిలీజ్ చేయాల‌నే సినిమా చేశాం. సినిమా చాలా బాగా వ‌చ్చింది. దానికి తోడు థియేట‌ర్స్ మ‌ళ్లీ పుంజుకోవ‌డంతో సినిమాను ఆగ‌స్ట్ 19న విడుద‌ల చేయాల‌నుకున్నాం. స‌పోర్ట్ చేసిన అంద‌రికీ థాంక్స్‌’’ అన్నారు.
 
నిర్మాత శ్రీవాస్ మాట్లాడుతూ ‘‘రాజా ర‌వీంద్ర‌, మ‌నోగారు, భ‌ర‌ణిగారు ముగ్గుర అంకుల్స్‌గా పోటీప‌డి.. స‌త్తిబాబుగారిని ఎంక‌రేజ్ చేస్తూ, సీన్స్‌ను ఇంప్ర‌వైజ్ చేస్తూ, స‌ర‌దాగా సినిమాను పూర్తి చేశారు. హ్యాపినింగ్ వ్యాపారాలు చేసుకునే ముగ్గురు భ‌ర్త‌ల‌ను భార్య‌లు నిర్ల‌క్ష్యం చేస్తే ఏమ‌వుతుంద‌నే పాయింట్‌తో సినిమాను స‌ర‌దాగా కాన్సెప్ట్‌తో చేశాం. దీనికి శ్రీముఖి గ్లామ‌ర్‌, ఎన‌ర్జీ, పెర్ఫామెన్స్ సినిమాకు మ‌రింత ప్ల‌స్ అయ్యింది. సినిమా ఎక్క‌డా బోర్ కొట్ట‌దు. బండ్ల గ‌ణేశ్ రియ‌ల్ క్యారెక్ట‌ర్‌ను చేశారు. సినిమా ప్రేక్ష‌కులు ఎంజాయ్ చేసేలా ఉంటుంది. బొడ్డు అశోక్‌గారు స‌పోర్ట్ దొర‌క‌డం మా అదృష్టం. మంచి టీమ్ కుదిరింది. శ్రేయాస్ శ్రీను త‌న‌కున్న ప‌రిచ‌యాల‌తో మంచి టీమ్‌ను అసోసియేట్ చేశాడు. ఇంకా చాలా క‌థ‌ల‌ను సిద్ధంగా పెట్టుకున్నాం. స‌పోర్ట్ చేసిన అంద‌రికీ థాంక్స్‌’’ అన్నారు.
 
డైరెక్ట‌ర్ స‌త్తిబాబు మాట్లాడుతూ ‘‘మా క్రేజీ అంకుల్స్‌..రాజా ర‌వీంద్ర‌గారు రాజుగారిగా, మ‌నోగారు రెడ్డిగారిగా, భ‌ర‌ణిగారు రావుగారి పాత్ర‌లో క‌నిపిస్తారు. ఈ ట్రిపుల్ ఆర్ అంకుల్స్ సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉండ‌బోతుంద‌నేదే ఈ సినిమా. ఈ ముగ్గురితో శ్రీముఖి ఎలాంటి మ్యాచ్ ఆడించిందో తెలుసుకోవాలంటే,  ఆగ‌స్ట్ 19న థియేట‌ర్స్‌లో క‌లుద్దాం’’ అన్నారు.