సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By Selvi
Last Updated : గురువారం, 2 ఆగస్టు 2018 (11:50 IST)

''రోషగాడు''గా వస్తున్న బిచ్చగాడు.. టీజర్ చూడండి.. (వీడియో)

''బిచ్చగాడు'' సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న విజయ్ ఆంటోనీ తాజాగా రోషగాడు అనే సినిమా ద్వారా రానున్నాడు. తమిళంలో ''తిమిరు పిడిచ్చవన్'' అనే పేరిట విజయ్ ఆంటోనీ సినిమా రూపుదిద్దుకుంది. తెలుగులో ఈ

''బిచ్చగాడు'' సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న విజయ్ ఆంటోనీ తాజాగా రోషగాడు అనే సినిమా ద్వారా రానున్నాడు. తమిళంలో ''తిమిరు పిడిచ్చవన్'' అనే పేరిట విజయ్ ఆంటోనీ సినిమా రూపుదిద్దుకుంది. తెలుగులో ఈ సినిమాకు రోషగాడు అనే టైటిల్‌ను ఖరారు చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్‌ను రిలీజ్ చేశారు. 
 
ఈ చిత్రంలో విజయ్ ఆంటోని పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తున్నాడని టీజర్‌ని బట్టి తెలిసిపోతోంది. ''ఒళ్లంతా పొగరురా.. పొగరుకే మొగుడురా.. మాట పడని 'రోషగాడు'రా.. అంటూ టీజర్ ప్రారంభంలో పాడిన పాట అదిరింది. ఈ చిత్రానికి గణేష దర్శకుడు. సంగీతం-విజయ్ ఆంటోనీ. ఈ టీజర్‌ను మీరూ ఓ లుక్కేయండి.