సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 23 అక్టోబరు 2020 (18:50 IST)

రెండు తలల పాము.. అది కూడా పిల్లి పట్టుకొచ్చింది.. ఎక్కడ? (video)

two headed snake
వింత జీవులు ఈ లోకంలో చాలానే పుడుతున్నాయి. వాటిలో కొన్ని రెండు తలల పాములు. అలాంటి చాలా అరుదు. అయితే అమెరికాలో తాజాగా ఓ రెండు తలలు పాము కనిపించింది. అదొక విశేషమైతే, ఓ పిల్లి దాన్ని పట్టుకొచ్చి తన యజమానికి కానుకగా ఇవ్వడం మరో విశేషం. వివరాల్లోకి వెళితే..  ఫ్లోరిడా రాష్ట్రంలోని పామ్ హార్బర్‌లో నివసిస్తున్న కే రోజెర్స్‌ ఓ పిల్లిని పెంచుకుంటోంది. దాని పేరు ఆలివ్. 
 
ఆలివ్‌కు బయట తిరగడమంటే భలే సరదా. అది ఇటీవల బయటికి వెళ్లింది. వస్తూ వస్తూ బారెడు పొడవున్న రెండు తలల పామును తీసుకొచ్చింది. దాన్ని నేరుగా లివింగ్ రూంలోకి తీసుకొచ్చి కార్పెట్‌పైన ఉంచింది. రోజెర్స్ కూతురు మొదట ఆ పామును చూసి భయపడిపోయింది. తర్వాత వింతగా ఉందని ఎక్కడికీ పారిపోకుండా బంధించింది. దానికి డోస్ అనే పేరు కూడా పెట్టింది.
 
రోజెర్స్ ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు ఫోన్ చేసి చెప్పింది. వాళ్లొచ్చి ఆ వింత పామును పెట్టుకెళ్లిపోయారు. జన్యులోపం వల్ల ఇలాంటివి పుడతాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రస్తుతం వింతపామును జూలో ఉంచి కాపాడుతున్నారు.