Daily Horoscope
✕

కార్యకర్తలను చితక్కొట్టినా గెలిపించారు... అనంత తెదేపాలో 'ఒక్క మగాడు'...

Written By జె
Updated: శుక్రవారం, 31 మే 2019 (17:13 IST)
ఎపిలో తెలుగుదేశం పార్టీ భారీ ఓటమిని చవిచూసింది. కేవలం 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఆ పార్టీ నుంచి గెలుపొందారు. తన సొంత జిల్లా చిత్తూరులో చంద్రబాబునాయుడు కేవలం ఒకే ఒక్క సీటులో గెలుపొందారు. అది కూడా ఆయన సీటే. మొదట్లో చంద్రబాబునాయుడు రెండు రౌండ్లలో వెనుకబడిపోయారు. వైసిపి అభ్యర్థి చంద్రమౌళి రెండు రౌండ్లలోనే ముందజంలో ఉన్నారు.
 
దీంతో ఒక్కసారిగా చంద్రబాబు ఓడిపోతారన్న ప్రచారం బాగా సాగింది. కానీ ఆ తరువాత చంద్రబాబు నాయుడు పుంజుకుని గెలుపొందారు. గతంతో పోలిస్తే మెజారిటీ కాస్త తక్కువే. అయితే అనంతపురం జిల్లాలో బాలక్రిష్ణ గెలుస్తాడా లేదా అన్న ప్రచారం పెద్దగానే సాగింది. బాలక్రిష్ణ ఓడిపోతారని బెట్టింగ్‌లు బాగానే కట్టారు. కానీ బాలక్రిష్ణ మాత్రం హిందూపురంలో గెలిచారు. అనంతపురంలో చెప్పుకోదగ్గ టిడిపి నాయకుడు బాలక్రిష్ణ ఒక్కరే. చేతికందిన కార్యకర్తలను అప్పుడప్పుడూ చితక్కొట్టినా అదంతా ప్రేమతో కొట్టిన చితక్కొట్టుడే అని ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది. అందుకే అనంత తెదేపాలో ఒక్క మగాడంటూ జిల్లాలో ప్రచారం జోరుగా సాగుతోంది.
 
వైసిపి అభ్యర్థిని దీటుగా ఎదుర్కొన్నారు బాలక్రష్ణ. అభివృద్ధిలో హిందూపురంను ముందుకు సాగించారు. అందుకే ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారన్నారు. దీంతో బాలక్రిష్ణ కూడా హిందూపురం ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. నాపై నమ్మకం ఉంచారు. నేను హిందూపురంను మరింత అభివృద్థి చేస్తానంటూ హామీ ఇచ్చారు.

అన్నీ చూడండి

Soori 7: సూరి ఏడవ కథానాయకుడిగా సూరి 7 చెన్నైలో ఘనంగా ప్రారంభమైంది

Naga Chaitanya :మైథికల్ థ్రిల్లర్ నాగ చైతన్య వృషకర్మ సరికొత్త అడ్వెంచర్ పోస్టర్

Anupama: నా పెళ్లి గురించి ఇంట్లో ఒత్తిడి లేదు. ఇష్టమైనప్పుడు పెళ్లి చేసుకోమనే అన్నారు : అనుపమ పరమేశ్వరన్

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ హీరోగా అనిల్ సుంకర చిత్రం ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్

Teja Sajja: గరివిడి లక్ష్మి మ్యూజికల్ కాన్సర్ట్ తో గౌరవం తీసుకొచ్చే సినిమా : తేజ సజ్జా

తర్వాతి కథనం
Show comments