Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఐ లవ్‌ యూ' అని చెప్పినా కనికరించలేదు.. కిందపడేసి గుండెలపై కూర్చొని...

ఇటీవల హైదరాబాద్ నగరంలో ప్రేమించలేదన్న కోపంతో ఇంటర్ చదివే విద్యార్థినిని సహచర ఇంటర్ విద్యార్థి బ్లేడుతో గొంతుకోసి చంపేశాడు. తన వెంటబడి వేధిస్తూ వచ్చిన ఆ యువకుడు కిరాతక చర్యకు పూనుకుంటున్నాడని గ్రహించిన

Written By pnr
Updated: గురువారం, 9 ఆగస్టు 2018 (17:10 IST)
ఇటీవల హైదరాబాద్ నగరంలో ప్రేమించలేదన్న కోపంతో ఇంటర్ చదివే విద్యార్థినిని సహచర ఇంటర్ విద్యార్థి బ్లేడుతో గొంతుకోసి చంపేశాడు. తన వెంటబడి వేధిస్తూ వచ్చిన ఆ యువకుడు కిరాతక చర్యకు పూనుకుంటున్నాడని గ్రహించిన ఆ విద్యార్థిని.. ప్లీజ్ నన్ను వదిలిపెట్టు.. నిన్ను ప్రేమిస్తున్నా.. ఐ లవ్ యూ అంటూ వేడుకుంది. కానీ, ఆ కిరాతకుడు మాత్రం ఆ బాలిక గుండెలపై కూర్చొని బ్లేడుతో గొంతు కోసి హత్య చేసినట్టు ఆ  దుర్మార్గుడు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించాడు. 
 
హైదరాబాద్, అంబర్‌నగర్‌ ప్రాంతానికి చెందిన హరిప్రకాష్‌ కుమార్తె అనూష అనే విద్యార్థిని హిమాయత్‌ నగర్‌లోని నారాయణ కాలేజీలో, పార్శిగుట్ట నివాసి వెంకట్‌ నారాయణ గూడలోని శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్‌ చదువుతున్నారు. పదో తరగతి నుంచి వీరిద్దరికీ పరిచయం ఉంది. రెండేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఒకే బస్‌లో కాలేజీకి వెళ్లడంతోపాటు చాటింగ్‌ చేసుకునేవారు. వెంకట్‌ ఇటీవల వేరే అమ్మాయితో మాట్లాడటం అనూష చూసింది. అప్పటి నుంచి ఆమెకు అతడిపై అనుమానం పెరిగింది.
 
ఇన్‌స్ట్రాగ్రాంలో వేరే పేరుతో నకిలీ అకౌంట్‌ ఓపెన్‌ చేసి వెంకట్‌తో చాటింగ్‌ చేసింది. అతడు కూడా ఆమెతో చాలాసార్లు చాటింగ్‌ చేయడంతో అనూషకు అతడిపై ఉన్న అనుమానం బలపడిందన్నారు. అప్పటినుంచి అతడిని దూరం పెడుతూ వచ్చింది. వెంకట్‌ ఫోన్‌ను బ్లాక్‌ లిస్టులో పెట్టింది. పది రోజుల నుంచి ఇద్దరి మధ్య ఫోన్‌ కాల్స్‌, మెసేజ్‌లు లేవు. ఇది జీర్ణించుకోలేని అతడు ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించినా వీలుపడకపోవడంతో చంపేయాలని నిర్ణయించుకున్నాడు. 
 
ఆ తర్వాత అనూషను తీసుకుని ఆర్ట్స్‌ కళాశాల రైల్వేక్వార్టర్స్‌కు చేరుకున్నారు. ఆమెకు నచ్చజెప్పేందుకు అతడు ప్రయత్నించాడు. అయినా అతడి ప్రేమను తిరస్కరించడంతో ఆమెను కిందపడేసి గుండెలపై కూర్చొని బ్లేడ్‌తో గొంతు కోశాడు. అతడి ప్రవర్తన చూసి భయపడిన అనూష 'ఐ లవ్‌ యూ' అని చెప్పినా వినిపించుకోలేదు. అక్కడి నుంచి మరో గదిలోకి లాక్కెళ్లి మరలా గొంతు కోసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే, అనూష కేకలు విన్న కొందరు ఆ కిరాతకుడుని పట్టుకుని నిలదీయగా అనూషను చంపేసినట్టు చెప్పాడు. దీంతో ఆగ్రహానికిగురైన స్థానికులు చితకబాది పోలీసులకు సమాచారం అందించారు. 
About Author
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... Read More

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments