Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

ముంబై మోడల్ హత్య.. స్నేహితుడే చంపేసి చెత్తకుండీలో వేసేశాడు..

మహిళలపై అకృత్యాలు జరుగుతూనే వున్నాయి. మీ టూ లాంటి ఎన్ని ఉద్యమాలు వచ్చినా మహిళలపై నేరాలు ఆగడం లేదు.

Updated: మంగళవారం, 16 అక్టోబరు 2018 (12:10 IST)
మహిళలపై అకృత్యాలు జరుగుతూనే వున్నాయి. మీ టూ లాంటి ఎన్ని ఉద్యమాలు వచ్చినా మహిళలపై నేరాలు ఆగడం లేదు. ఓ అందాల మోడల్‌ను దుండగులు దారుణంగా హత్య చేసి చెత్తకుండీలో వేశారు. ఈ ఘటన దేశ వాణిజ్య నగరం ముంబైలో చోటుచేసుకుంది.


వివరాల్లోకి వెళితే.. ముంబైలోని ప్రముఖ మోడల్, సోషల్ మీడియాలో వేలాదిమంది అభిమానులను సంపాదించుకున్న రాజస్థాన్ భామ మానసి దీక్షిత్ (20) దారుణహత్యకు గురైంది. ఆమె మృతదేహాన్ని ఓ ట్రావెల్ బ్యాగులో కుక్కి, చెత్తకుండీలో పడేసి వెళ్లారు.
 
రాజస్థాన్‌లోని కోట ప్రాంతానికి చెందిన మానసి, మోడలింగ్‌లో రాణిస్తోంది. ఆరు నెలల క్రితం ఆమె ముంబైకి వచ్చి, అంధేరీ ప్రాంతంలో నివాసాన్ని ఏర్పరచుకుంది. ఆమెకు అదే ప్రాంతానికి చెందిన సయ్యద్ (19) అనే డిగ్రీ సెకండియర్ చదువుతున్న యువకుడు పరిచయం అయ్యాడు. వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఇంతలో ఏమైందో ఏమో కానీ సయ్యద్ మానసిని దారుణంగా హత్య చేశాడని పోలీసులు తెలిపారు. ఆమెను దారుణంగా హత్య చేసిన సయ్యద్, బ్యాగులో మృతదేహాన్ని కుక్కి, మలాద్ ప్రాంతంలో ఉన్న మైండ్ స్పేస్ వద్ద చెత్తలో పడేశాడు.
 
చెత్త కుండీలోంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు వచ్చి ఆ మృతదేహం మానసిదని తేల్చారు. విచారిస్తున్న క్రమంలో సీసీటీవీ ఫుటేజ్‌ని పరిశీలించగా, ఓ క్యాబ్‌లో వచ్చిన సయ్యద్, మృతదేహాన్ని అక్కడ పడేసినట్టు కనిపించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సయ్యద్‌ను అరెస్ట్ చేశారు.

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments