బాయ్‌కాట్ కేఎఫ్‌సీ.. క్షమాపణలు చెప్పినా శాంతించని నెటిజన్లు
బాయ్‌కాట్ కేఎఫ్‌సీ హ్యాష్‌ట్యాగ్ ప్రస్తుతం ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో వుంది. ఇందుకు కారణం పాకిస్థాన్ ట్విట్టర్ హ్యాండిల్‌లో ఆ సంస్థ.. కాశ్మీర్‌కు సంఘీభావం తెలపడమే. పాకిస్థాన్ "కశ్మీర్ డే"ను జరుపుకునే ఫిబ్రవరి 5న ఇందుకు సంబంధించిన పోస్టు ఫేస్‌బుక్‌లో షేర్ అయింది. ఇది క్షణాల్లో వైరల్ కావడంతో భారతీయ నెటిజన్లు కేఎఫ్‌సీపై మండిపడ్డారు. #BoycottKFC పేరుతో కేఎఫ్‌సీపై నెటిజన్లు పెద్ద ఎత్తున విరుచుకుపడటం ట్రెండింగ్ అవుతోంది.
కాశ్మీర్ కాశ్మీరీలకే చెందుతుందని.. కేఎఫ్‌సీ ఫోటోపై రాసుకొచ్చింది. దీనిని తొలగించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోవడంతో ఆ సంస్థ క్షమాపణలు చెప్పినా నెటిజన్లు మాత్రం శాంతించడం లేదు. దేశం వెలుపల కేఎఫ్‌సీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ పోస్టుపై క్షమాపణలు తెలియజేస్తున్నట్టు పేర్కొంది. భారత్‌ను తాము గౌరవిస్తామని చెప్పుకొచ్చింది. భారతీయులందరికీ నిబద్ధతతో సగర్వంగా సేవలు అందిస్తామని వివరించింది.