శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 8 ఫిబ్రవరి 2022 (16:52 IST)

#Boycott Hyundai హ్యాష్‌ట్యాగ్ ట్రెడింగ్ - సారీ చెప్పిన హ్యూండాయ్

దేశంలోని కార్ల ఉత్పత్తి సంస్థల్లో ఒకటైన హ్యూండాయ్ వివాదంలో చిక్కుకుంది. కాశ్మీర్ వేర్పాటువాదులకు మద్దతు ఇచ్చే రీతిలో పాకిస్థాన్ దేశానికి చెందిన హ్యూండాయ్‌ డీలర్ ఒకరు చేసిన పోస్టు వివాదాస్పదమైంది. ఈ పోస్ట్ వైరల్ కావడంతో భారత నెటిజన్లు #Boycott Hyundai అనే హ్యాష్‌ట్యాగ్ పేరుతో ట్రెండింగ్ చేశారు. దీని దెబ్బకు హ్యూండాయ్ దిగివచ్చి క్షమాపణలు చెప్పింది. 
 
ఇదే అంశంపై దక్షిణ కొరియా విదేశాంగ మంత్రి చుంగ్ ఇయు యంగ్ మంగళవారం భారతీయ విదేశాంగ మంత్రి జైశంకర్‌తో ఫోనులో మాట్లాడినట్టు విదేశాంగ కారక్యాలయ ప్రతినిధి అరిందం బాగ్చి ట్వీట్ చేశారు. భారత్‌లో ఉన్న కొరియా అంబాసిడర్ చాంగ్ జే బోక్‌కు సోమవారం సమన్లు జారీచేసిన విషయం తెల్సిందే. దీంతో ఆయన సోషల్ మీడియాలో వచ్చిన పోస్టుల పట్ల తీవ్ర వ్యక్తం చేశారు. 
 
అదేసమయంలో హ్యూండాయ్ యాజమాన్యం మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇందులో క్షమాపణలు చెప్పారు వివిధ దేశాలకు చెందిన రాజకీయ, మతపరమైన అంశాలపై తాము ఎలాంటి కామెంట్స్ చేయబోమని, ఇది తమ కంపెనీ విధానానికి వ్యతిరేకమని, ఆయా దేశాల జాతీయతకు దృఢంగా కట్టుబడివుంటామని తెలిపింది.