శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (23:24 IST)

అమెజాన్‌ ఫైర్‌ టీవీ స్ట్రీమింగ్‌ ట్రెండ్స్‌ 2021 ఎలా వున్నాయో చూడండి...

అమెజాన్‌ నేడు 2021 సంవత్సరపు ఫైర్‌ టీవీ స్ట్రీమింగ్‌ ధోరణులను విడుదల చేసింది. భారతదేశ వ్యాప్తంగా తమ ఫైర్‌ టీవీ ఉపకరణాల వ్యాప్తంగా కంటెంట్‌ వినియోగపు ధోరణులను సవివరంగా దీని ద్వారా వెల్లడించింది. సిగ్నేచర్‌ ఫైర్‌టీవీ క్యూబ్‌ ఆవిష్కరణతో పాటుగా అమెజాన్‌ యొక్క మొట్టమొదటి స్ధానిక తయారీ ఉత్పత్తి చేసిన ఫైర్‌ టీవీ ఉపకరణాల ఆవిష్కరణతో  దేశంలో ఫైర్‌ టీవీకి ఓ మైలురాయి సంవత్సరంగా 2021 నిలిచింది.

 
‘‘ఫైర్‌ టీవీతో, మొత్తం కుటుంబానికి వినోదాన్ని పంచిపెట్టాలని మేము కోరుకున్నాము. మరీ ముఖ్యంగా ఎక్కువ మంది ప్రజలు ఇళ్లలో గడుపుతున్న ప్రస్తుత పరిస్థితులలో ఆ వినోదం అందించాలని కోరుకున్నాము. ఫైర్‌టీవీలో ప్రతి ఒక్కరికీ ఒకటి ఉంది. అది చిన్నారుల కోసం కంటెంట్‌,  ఎదిగే పిల్లలు, సినీ అభిమానులు లేదా ఫిట్‌నెస్‌ ప్రియులు... అయినా సరే ఈ వినోదం అందించాలనుకున్నాము.

 
భారతదేశంతో పాటుగా ప్రపంచ వ్యాప్తంగా ప్రాధాన్యతా స్ట్రీమింగ్‌ మీడియా ఉపకరణంగా అన్ని రకాల వినోదానికి ఇది నిలిచింది. దాదాపు 150 మిలియన్‌ ఫైర్‌ టీవీ ఉపకరణాలు ప్రపంచవ్యాప్తంగా విక్రయించబడ్డాయి మరియు  ప్రతి నెలా కోట్లాది గంటలను వినియోగదారులు స్ట్రీమింగ్‌ చేస్తున్నారు’’ అని పరాగ్‌ గుప్తా, హెడ్‌ ఆఫ్‌ అమెజాన్‌ డివైజస్‌, ఇండియా అన్నారు. ‘‘మా వినియోగదారుల తరపున నిరంతరం మేము నూతన ఆవిష్కరణలను చేయాలనుకుంటున్నాము. తద్వారా వారు సౌకర్యవంతంగా కనుగొనడంతో పాటుగా నూతన షోస్‌, చిత్రాలను ఆస్వాదించగలరని ఆశిస్తున్నాము’’ అని అన్నారు.

 
గత సంవత్సరం ఫైర్‌ టీవీ వినియోగదారుల నడుమ మేము పరిశీలించిన కొన్ని స్ట్రీమింగ్‌ ధోరణులలో...
 
ఫైర్‌టీవీ- మీ అపరిమిత వినోద సేహితుడు
2021లో, వినియోగదారులు దాదాపు 4 గంటలు ప్రతి రోజూ తమ ఫైర్‌ టీవీ ఉపకరణాలపై కంటెంట్‌ వీక్షణ చేశారు. 2020లో అది రోజుకు మూడు గంటలుగా ఉండేది.
 
ప్రతి ముగ్గురు ఫైర్‌ టీవీ వినియోగదారులలో ఒకరు  కేబుల్‌ లేదా డీటీహెచ్‌ కనెక్షన్‌కు ఇక సెలవేనని చెబుతున్నారు.
 
ఫైర్‌ టీవీ ఉపకరణాలపై సరాసరిన ప్రతి నాలుగు సెకన్లకూ ఓ మారు అలెక్సాతో వినియోగదారులు ఇంటరాక్ట్‌ అవుతున్నారు.

 
మరిన్ని నగరాలకు విస్తరించిన ఫైర్‌ టీవీ
భారతదేశ వ్యాప్తంగా 80% పిన్‌కోడ్‌లలో వినియోగదారులు ఫైర్‌ టీవీలను కొనుగోలు చేశారు.  చిన్న నగరాలైన హిసార్‌, తిరువల్లూరు, చిత్తూరు, అల్వార్‌, ఇంఫాల్‌,  సౌత్‌ అండమాన్‌ లలో ఫైర్‌ టీవీ ఉపకరణాల విక్రయాలు గణనీయంగా పెరిగాయి.
 
భారతదేశ వ్యాప్తంగా వినియోగదారులు హార్డ్‌వేర్‌ప్రయోజనాలను పొందడంతో పాటుగా ఫైర్‌ టీవీపై మెరుగైన ఫీచర్లను ఆస్వాదిస్తున్నారు. ప్రతి నలుగురు వినియోగదారులలో ఒకరు ఫైర్‌ టీవీ ఉపకరణాలపై వేగవంతమైన వెర్షన్స్‌ వినియోగించడం లేదా నూతన వెర్షన్స్‌కు అప్‌గ్రేడ్‌ కావడం జరిగింది.
 
ప్రైమ్‌ డే మరియు అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌లో పది అత్యంత ప్రజాదరణ పొందిన ఉత్పత్తులలో ఒకటిగా ఫైర్‌ టీవీ స్టిక్‌ నిలిచింది
 
35% మంది వినియోగదారులు తమ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులకు ఫైర్‌ టీవీ ఉపకరణాలను బహుమతిగా అందించడం లేదా షేర్‌ చేయడం చేస్తున్నారు
 
ఫైర్‌ టీవీ వినియోగదారులు నవ్వుల కోసం వెదుకుతున్నారు
ఫైర్‌ టీవీ వినియోగదారుల నడుమ అత్యంత ప్రాధాన్యతా టీవీ జెనర్‌లో కామెడీ తమ స్థానం నిలుపుకుంది
 
ప్రతి నిమిషం ఫైర్‌ టీవీ వినియోగదారులు అలెక్సాను  తారక్‌ మెహతా కా ఊల్తా చష్మా గురించి అడిగారు, ఫైర్‌ టీవీ ఉపకరణాలపై ఎక్కువ మంది వెదికిన టీవీ షోగా ఇది నిలిచింది.
 
ఫైర్‌ టీవీ ఉపకరణాలపై ఎక్కువ మంది వీక్షించిన కిడ్స్‌ షోలుగా పెప్పా పిగ్‌, డొరెమన్‌, కోకోమెలన్‌లు నిలిచాయి. ప్రతి నిమిషం కనీసం ఒక వినియోగదారుడు అయినా ఈ షోలను ఫైర్‌ టీవీపై అడుగుతున్నారు.
 
ఫైర్‌ టీవీపై ప్రైమ్‌ వీడియో ద్వారా అపరిమిత వినోదం
ఫైర్‌ టీవీ ఉపకరణాలపై వినియోగదారులు పలు భాషలలో తాజా చిత్రాలను వీక్షించడానికి అమితాసక్తిని చూపుతున్నారు. మరీ ముఖ్యంగా భద్రత, సౌకర్యం పరంగా అది అవసరమని భావిస్తున్నారు. ప్రైమ్‌ వీడియోపై అధికంగా స్ట్రీమ్‌ అయిన చిత్రాలలో ....
 
హిందీ -షేర్‌షా, షేర్నీ, సర్దార్‌ ఉదమ్‌
 
తమిళం- జైభీమ్‌, సర్పట్ట  పరంబరాయ్‌, మాస్టర్‌
 
మలయాళం- దృశ్యం 2, కోల్‌ కేస్‌, మాలిక్‌
 
తెలుగు- దృశ్యం 2, టక్‌ జగదీష్‌, నారప్ప
 
కన్నడ- రత్నన్‌ ప్రపంచ, యువరత్న, రాబర్ట్‌
 
ఫ్యామిలీమెన్‌ సీజన్‌ 2ను అత్యధికంగా వీక్షించిన ఇండియన్‌ షోగా మరియు వీల్‌ఆఫ్‌ టైమ్‌ అత్యధికంగా స్ట్రీమ్‌ కాబడిన అంతర్జాతీయ షోగా  ప్రైమ్‌ వీడియో ద్వారా ఫైర్‌ టీవీ ఉపకరణాలలో నిలిచాయి.
 
టీవీ షోలు మరియు సినిమాలను మించి...
 ప్రతి నలుగురు ఫైర్‌ టీవీ వినియోగదారులలో ఒకరు తమ ఫైర్‌ టీవీ ఉపకరణాలను సంగీతం వినడం కోసం వినియోగించారు.
 
గత సంవత్సరంతో పోలిస్తే 15% అధికంగా వినియోగదారులు యోగ మరియు ఫిట్‌నెస్‌ యాప్‌లను స్ట్రీమింగ్‌ చేశారు
 
తమ ఫైర్‌ టీవీ ఉపకరణాలపై అలెక్సా వినియోగించి వినియోగదారులు తమ స్మార్ట్‌ హోమ్‌ కంట్రోల్‌ చేయడం 2020తో పోలిస్తే 2021లో 150% పెరిగింది.