ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ , శనివారం, 22 జనవరి 2022 (17:43 IST)

సుబ్రహ్మణ్యేశ్వరుని సేవలో బుల్లి తెర నటి పల్లవి

బుల్లితెర న‌టి... అత్తారింటికి దారేది హీరోయిన్ ప‌ల్ల‌వి త‌న భ‌ర్త‌తో క‌లిసి సుబ్రహ్మణ్యేశ్వరుని పూజ‌లు చేసింది. కృష్ణా జిల్లా మోపిదేవిలో స్వయంభువుగా కొలువుతీరిన శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ప్రముఖ బుల్లితెర నటి రామిశెట్టి పల్లవి దర్శించుకున్నారు.
 
 
ఆలయ ఆవరణలో గల నాగ పుట్టలో పల్లవి దంపతులు పాలు పోసి, మొక్కుబడులు చెల్లించారు. అనంతరం స్వామి వారిని దర్శించుకొనగా, ఆలయ అర్చకులు వేద మంత్రోర్చనల మధ్య శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పల్లవి దంపతులను ఆలయ మర్యాదలతో సన్మానించారు. సుబ్రహ్మణ్యేశ్వరుని  అనుగ్ర‌హం కోసం ఈ దేవాల‌యానికి వ‌చ్చామ‌ని,  మోపిదేవిలో స్వయంభువుగా కొలువుతీరిన శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని  ద‌ర్శించ‌డం త‌మ సుకృత‌మ‌ని ప‌ల్ల‌వి పేర్కొంది.