శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 17 జనవరి 2022 (10:22 IST)

సూపర్ స్టార్‌కు సోదరిగా సాయిపల్లవి?

సూపర్ స్టార్ మహేష్ బాబుకు సోదరిగా సాయిపల్లవి నటించనుందనే వార్త నెట్టింట వైరల్ అవుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సోదరి పాత్ర చుట్టూ తిరుగుతుందని టాక్ వస్తోంది.  
 
దీంతో మహేష్‌కు సాయి పల్లవి సిస్టర్‌గా అయితేనే ఉంటుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారట మేకర్స్. ఇక ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌‌గా నటిస్తోంది. పూజా‌తో పాటు మరో హీరోయిన్ కూడా ఉందట.
 
అయితే మొదట మహేష్‌పై సోలో సాంగ్ ను, అలాగే ఒక ఫైట్‌ను షూట్ చేస్తారట. ఇక పదకొండు సంవత్సరాల తరువాత మహేష్, త్రివిక్రమ్ కాంబోలో సినిమా రావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి.