శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : ఆదివారం, 15 జులై 2018 (12:21 IST)

కామాంధుడుని నడిరోడ్డుపై నడిపించి..చెప్పులతో కొట్టించిన పోలీసులు

ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి తనను పెళ్లి చేసుకోవాలంటూ బలవంతం చేస్తూ 12 గంటల పాటు గదిలో నిర్బంధించిన ఓ కామాంధుడుకి పోలీసులు తగిన విధంగా బుద్ధి చెప్పారు. ఆ యువతిని విముక్తి కల్పించడంతో పాటు ఆ కామాంధుడుని

ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి తనను పెళ్లి చేసుకోవాలంటూ బలవంతం చేస్తూ 12 గంటల పాటు గదిలో నిర్బంధించిన ఓ కామాంధుడుకి పోలీసులు తగిన విధంగా బుద్ధి చెప్పారు. ఆ యువతిని విముక్తి కల్పించడంతో పాటు ఆ కామాంధుడుని నడిరోడ్డుపై నడిపిస్తూ స్థానికులతో చెప్పుతో కొట్టించారు. భోపాల్‌లో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
భోపాల్ లో ఓ అమ్మాయిని 12 గంటల పాటు గదిలో నిర్బంధించి, తనను వివాహం చేసుకోవాలని వేదించిన కామాంధుడి నుంచి ఆమెను విడిపించిన పోలీసులు, నడిరోడ్డుపై బుద్ధి చెప్పే ప్రయత్నం చేశారు. భోపాల్‌లోని మిస్ రోడ్ ఏరియాలో ఉన్న ఐదంతస్తుల భవంతిలో రోహిత్ సింగ్ (30) అనే యువకుడు మోడల్‌గా ఉన్నాడు. ఈయన 26 ఏళ్ల వయసున్న యువతిని నిర్బంధించాడు. తనను పెళ్లి చేసుకోవాలంటూ బలవంతం చేశాడు. ఆమెను దారుణంగా చిత్రహింసలకు గురిచేశాడు. 
 
ఆ తర్వాత ఆ కామాంధుడు పోలీసులకు వీడియో కాల్ చేసి తన డిమాండ్లను చెప్పాడు. దీంతో పోలీసులు జాగ్రత్తగా వ్యవహరిస్తూ అతని డిమాండ్లు నెరవేర్చుతామనీ హామీ ఇచ్చి ఈమెను బంధవిముక్తురాలిని చేశారు. ఇక భోపాల్ వీధుల్లో రోహిత్ సింగ్‌ను నడిపించి తీసుకు వెళుతూ మహిళలతో చెప్పులతో కొట్టించారు. నిందితుడిని కోర్టు ముందు హాజరుపరిచామని, ఒకరోజు కస్టడీకి తీసుకున్నామని మిస్ రోడ్ పోలీస్ ఇనస్పెక్టర్ సంజీవ్ చౌసీ వెల్లడించారు. అతనిపై హత్యాయత్నం తదితర కేసులు పెట్టినట్టు చెప్పారు.
 
ఈ ఘటనపై బాధిత యువతి స్పందిస్తూ, తమ ఇద్దరికీ చాలా రోజులుగా పరిచయం ఉందన్నారు. అయితే, తొలి రోజుల్లో అతను తనను ఇబ్బంది పెట్టలేదని, ఆపై పెళ్లి చేసుకోవాలని వేధింపులు ప్రారంభించాడని, స్టాంప్ పేపర్‌పై ఆ విషయాన్ని రాసివ్వాలని బలవంతం చేశాడని ఆరోపించింది. తనకు అతన్ని వివాహం చేసుకోవడం ఇష్టం లేదని, అతన్ని జైలుకు పంపకుంటే తన ప్రాణాలకు ముప్పేనని వ్యాఖ్యానించింది. రోహిత్, మెడపై కత్తితో దాడి చేయడంతో ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.