Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా బాబా, మాస్క్‌తో కాదు మంత్రంతో కరోనా మాయం చేస్తా: కరోనా బాబా

Written By శ్రీ
Updated: శనివారం, 25 జులై 2020 (11:02 IST)
అమాయకుల అంధ విశ్వాసాలను తమకు అనుకూలంగా మార్చుకుంటూ అందినంత దోచుకొంటున్నాడు నకిలీ బాబా. అతీతమైన శక్తులతో కరోన రోగులకు నయం చేస్తానంటూ మోసాలకు పాల్పడుతున్నాడు ఓ కరోన బాబా. అందిన కాడికి డబ్బులు దండుకుంటున్నాడు. మాయలు, మంత్రాలతో కరోనా రోగులకు చికిత్స చేస్తే నయమవుతుందని శిష్యులతో ప్రచారం చేసుకుంటాడు.
 
బురిడీ కరోనా బాబా మాటలు నమ్మి వచ్చిన రోగులకు మంత్రాలు, నిమ్మకాయలు, విభూతితో పూజలు చేసి వేలాది రూపాయలు దండుకుంటున్నాడు కరోన బాబా ఇస్మాయిల్. కరోన చికిత్సకు ఆసుపత్రికి వెళ్ళనక్కర్లేదు, మాస్క్ పెట్టుకునే అవసరమే లేదు.. తనకున్న అపూర్వ శక్తులతో బాగు చేస్తానంటూ ఒక్కో కరోన రోగి నుంచి 40 వేల నుంచి 50 వేల వరకు వసూలు చేస్తున్నాడు.
 
ఇతని మాయమాటలు నమ్మి.. మోసపోయిన బాధితులు అర్ధరాత్రి హైదరాబాద్ మియపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు హఫీజ్ పేట్ హనీఫ్ కాలనీలోని కరోన బాబా స్థావరంపై దాడులు నిర్వహించారు. గత మార్చి  నెల నుంచి కరోనా బాబా దందాలు చేస్తున్నట్లు తెలిసింది.
 
కరోనా బాబాకు అతీతమైన శక్తులు ఉన్నాయంటూ శిష్యులచే ప్రచారం చేయించి, 
జలుబు, దగ్గు ఉన్నా.. అది కరోనా వైరసే అంటూ అమాయకులైన జనాన్ని భయపెట్టి వేలాది రూపాయలు వసూళ్లు చేస్తున్నారు. 70 మంది బాధితులు కరోనా బాబా చేతిలో మోసపోయినట్టు గుర్తించారు. కరోనా సోకినట్టైతే ఆసుపత్రికి వెళ్లాలని అక్కడున్న కొంతమందిని పోలీసులు పంపించేశారు.

అన్నీ చూడండి

ఓటరు కార్డు చిరునామా మార్చుకోమంటుంటే ప్రభుత్వాన్నే మార్చేస్తానంటారేంటి ప్రకాష్ రాజ్?!! వీడియో

హైదరాబాద్‌ను ఉర్రూతలూగించనున్న రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్

Rahul Sipligunj Case: రాహుల్ సిప్లగింజ్ కేసు.. ఒకవేళ ఆమె రాకపోతే...?

దేవ కట్టా సమర్పణలో రా, రస్టిక్, రొమాంటిక్ కామెడీ చిత్రం జో జో’

నేను రెడీ నుంచి హవీష్, కావ్య థాపర్ పై మస్తుగుందిరా యవ్వారం సాంగ్

తర్వాతి కథనం
Show comments