Daily Horoscope
✕

ధారావిలో శరవేగంగా కరోనా ... కంటిమీద కునుకు కరువు

Written By ఠాగూర్
Updated: శుక్రవారం, 24 ఏప్రియల్ 2020 (17:45 IST)
ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ ధారావి. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో ఉంది. ఈ మురికివాడలో నివసించే ప్రజలకు కరోనా సోకింది. ఇది అధికారులకు కంటిమీద కనుకులేకుండా చేస్తోంది. ఎందుకంటే, ఇక్కడ ఒక్కసారి కరోనా వైరస్ విజృంభిస్తే ఇక అదుపు చేయడం అసాధ్యమన్నది అధికారుల అంచనా. అందుకే ముంబై నగర పాలక సంస్థ అధికారులు భయంతో వణికిపోతున్నారు. ముందస్తు జాగ్రత్తగా ఏకంగా3 వేల కోవిడ్ కేర్ బెడ్లను కూడా సిద్ధం చేశారు. నిజానికి ఈ బెడ్లు ఏ మూలకూ సరిపోవు. కానీ, కేసుల అంచనాను బట్టి ఈ బెడ్ల సంఖ్యను పెంచాలని భావిస్తున్నారు. 
 
మరోవైపు, మహారాష్ట్రను కరోనా పట్టిపీడిస్తోంది. ఈ ఒక్క రాష్ట్రంలోనే 6500 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రంగా మహారాష్ట్ర మొదటిస్థానంలో ఉంటే, రెండో స్థానంలో రాజస్థాన్, మూడో స్థానంలో ఢిల్లీ ఉంది. అలాగే కరోనా మరణాల్లోనూ మహారాష్ట్రే ముందువరుసలో ఉంది. 
 
దీంతో దేశ ఆర్థిక రాజధానిగా ఉన్న ముంబై కరోనా దెబ్బకు చిగురుటాకులా వణికిపోతోంది. ప్రస్తుత పరిస్థితి మరో నెల రోజుల పాటు కొనసాగిన పక్షంలో ఈ ఒక్క రాష్ట్రంలోనే ఏకంగా 70 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావొచ్చని అంచనా వేస్తున్నారు. అందుకే మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు.. కేంద్రం కూడా ప్రత్యేక కార్యాచరణతో ముందుకుసాగుతోంది. 

అన్నీ చూడండి

Nag: ఇట్లు అర్జున సినిమాను ప్రజెంట్ చేయడం చాలా ప్రౌడ్‌గా ఉంది : నాగార్జున

Devika Bhat: రియాలిటీ ప్రేమలో మునిగిపోయిన కిరణ్ అబ్బవరం, దేవికా భట్

Jabardasth Emmanuel: నందినీ రెడ్డి ఆవిష్కరించిన డెస్టినీ ఫస్ట్ లుక్

Dulquer Salmaan: ఆకాశంలో ఓ తార చిత్రం టీజర్ సిద్ధమవుతోంది

Kalki 2: ప్రభాస్ పుట్టినరోజు తర్వాత కల్కి సీక్వెల్ ముంబైలో జరగనుంది ?

తర్వాతి కథనం
Show comments