Dharma Sangrah

బైక్‌పై సర్కస్‌.. భలే బ్యాలెన్స్ చేసిందిగా.. వండర్ వుమెన్ (వీడియో)

Written By సెల్వి
Updated: బుధవారం, 16 జూన్ 2021 (19:19 IST)
Bike ride
మహిళలు బైకులు నడపడం ఇంకా సాధారణం కాలేదు. స్కూటీలు నడిపే మహిళల్ని చూసివుంటాం. అలాంటి ఈ రోజుల్లో.. ఒక మహిళ తన తలపై సామగ్రి పెట్టుకుని బైక్‌పై సర్కస్‌ విన్యాసాలు చేస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. వీక్షకులు ఆమెను 'సూపర్ వుమన్' 'వండర్ ఉమెన్' అని పిలుస్తారు. డాక్టర్ అజైత అనే ట్విట్టర్ యూజర్ ఈ మహిళ అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించే వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
 
వీడియోలో ఒక మహిళ తన తలపై పాత్రలతో నిండిన తొట్టెను పెట్టుకొని ఒక చేతిలో బకెట్, మరో చేతిలో ఒక బ్యాగ్ పట్టుకొని ఉండి బైకు నడుపుతూ నీటి కాలువను ఎలాంటి జంకు లేకుండా దాటింది. ఈ వీడియోకు "బహుళ ప్రతిభ" అనే శీర్షికతో డాక్టర్ అజైత పోస్ట్ చేశారు. 41 సెకన్ల ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోను ఒక్క రోజులో 88 వేలకు పైగా ప్రజలు వీక్షించారు. ఈ వండర్‌వుమెన్‌‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

అన్నీ చూడండి

రోహిత్‌ను త్రిగుణ్ వేధిస్తున్నాడు: మద్దతుగా నిలిచిన డెమోన్ పవన్

Dhruv Vikram: రమేష్ వర్మతో ద్విభాషా యాక్షన్ చిత్రంగా ధ్రువ్ విక్రమ్ షూట్

Trivikram Srinivas: ఆదర్శ కుటుంబం – AK47 టీజర్ వచ్చేసింది

Ram-Lakshman: మా అబ్బాయికి జడలు వేయించి యాక్షన్ చేయించాం : రామ్-లక్ష్మణ్

Deepti Ghanta: నితిన్, దీప్తి గంట చిత్రం అలియాస్ రుక్మిణీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

తర్వాతి కథనం
Show comments