గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: బుధవారం, 16 జూన్ 2021 (15:54 IST)

మెంటల్ ఎవరికో జనానికి తెలుసు: రోజా ఫైర్

ఫైర్ బ్రాండ్ రోజా మరోసారి ఫైరయ్యారు. ఎపిఐఐసి కార్యాలయం వేదికగా ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్సి లోకేష్ పైన తీవ్రస్థాయిలో విమర్సలు  చేశారు. కరోనా సమయంలో రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు తెలుగుదేశం నేతలు ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు.
 
రాష్ట్రంలోని యువత మొత్తం తనలాగే తయారవ్వాలని లోకేష్ కోరుకుంటున్నారని కౌంటర్ ఇచ్చారు రోజా. పరీక్షలు రద్దుపై లోకేష్ చేస్తున్న రార్థాతం చూస్తుంటే నవ్వు తెప్పిస్తోందన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఎప్పుడూ ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడదని ప్రశ్నించారు.
 
తినింది అరక్క ఏదో ఒకటి మాట్లాడుతూ.. జూమ్ మీటింగ్‌లో ఇష్టానుసారం ప్రభుత్వంపై ముద్దపప్పు లోకేష్ విమర్సలు చేయడం సరైంది కాదన్నారు. రాష్ట్రంలోని వాళ్ళందరినీ ముద్దపప్పు అవ్వాలని లోకేష్ పోరాటం చేస్తున్నట్లు ఎద్దేవా చేశారు. ప్రస్తుతం 6 శాతానికి కరోనా తగ్గిందని కాబట్టి పరీక్షలపై నిర్ణయం ఇంకా ప్రభుత్వం తీసుకోలేదన్నారు.
 
చందమామ అంటూ జగన్ మోహన్ రెడ్డిని పిల్లలు ప్రేమగా పిలుస్తున్నారని.. మెంటల్ మామలు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు, లోకేష్‌లేనన్నారు. పిచ్చి కామెంట్స్ చేయడం మానుకుంటే బాగుంటుందని రోజా హితవు పలికారు.