సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By selvi
Last Updated : బుధవారం, 23 మే 2018 (13:18 IST)

పెట్రోల్ ధరలు ఎంత పెరిగినా... అమ్మాయిలను బయటకు తీసుకెళ్లకుండా?

బాలీవుడ్ నిర్మాత ఏక్తాకపూర్ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను యువతీ యువకులను పోలుస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెట్రోలు ధరలు ఏమాత్రం పెరిగినా.. అబ్బాయిలు, అమ్మాయిలను బయ

బాలీవుడ్ నిర్మాత ఏక్తాకపూర్ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను యువతీ యువకులను పోలుస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెట్రోలు ధరలు ఏమాత్రం పెరిగినా.. అబ్బాయిలు, అమ్మాయిలను బయటకు తీసుకెళ్లడాన్ని ఆపరని సెటైర్లు విసిరారు. 
 
ధరల మంట నుంచి తప్పించుకోవాలంటే.. ఎక్కువ సేపు డ్రైవింగ్ చేయకుండా.. సినిమా హాలులో కూర్చుని ఎక్కువ సమయాన్ని గడపాలని సలహా ఇచ్చింది. ఇదే సమయంలో ఓ సినిమా అయితే, చూడకుండా వదిలేయొచ్చుగానీ, పెట్రోలును కొనకుండా ఆపలేమని కూడా ఆమె పేర్కొంది.
 
ఇదిలా ఉంటే.. పెట్రోలు, డీజిల్‌ ధరలు రోజురోజుకి పెరుగుతూ జీవితకాల గరిష్ఠానికి చేరుకుంటున్నాయి. కర్ణాటక ఎన్నికల అనంతరం చమురు సంస్థలు గత ఏడు రోజులుగా వరుసగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచుతున్నాయి.