శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : ఆదివారం, 2 సెప్టెంబరు 2018 (16:26 IST)

లోక్‌సభకు షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు : రాజ్‌నాథ్ సింగ్

లోక్‌సభకు షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ, షెడ్యూల్ ప్రకారమే లోక్‌సభకు ఎన్నికలు జరుగుతాయని, ఎట్టి పరిస్థితుల్లో ముందస

లోక్‌సభకు షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ, షెడ్యూల్ ప్రకారమే లోక్‌సభకు ఎన్నికలు జరుగుతాయని, ఎట్టి పరిస్థితుల్లో ముందస్తుకు అవకాశమే లేదని తేల్చి చెప్పారు.
 
మొత్తం ప్రక్రియ 2019, మే 15లోపు పూర్తవుతుందన్నారు యజమిలీ ఎన్నికలపై దృష్టిసారించిన కేంద్రం.. డిసెంబర్‌లో నాలుగు రాష్ట్రా ఎన్నికలతోపాటు లోక్‌సభకు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే దానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశమే లేదని రాజ్‌నాథ్ చెప్పడం గమనార్హం.
 
అలాగే, జమిలీ ఎన్నికల విషయంలో ఎన్నికల సంఘానిదే తుది నిర్ణయమని కూడా రాజ్‌నాథ్ స్పష్టంచేశారు. జమిలీ ఎన్నికలు నిర్వహించడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే చెప్పారు. ఎన్నికల సంఘం ఆ పని చూడాలి అని రాజ్‌నాథ్ సమాధానమిచ్చారు.