ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 15 ఆగస్టు 2023 (16:39 IST)

బొద్దింకలను టమోటా-చిల్లీ సాస్‌తో కలిపి తినేసింది.. వీడియో వైరల్

fried cockroaches
fried cockroaches
సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఓ యువతి బొద్దింకను టమోటా చట్నీతో కలిపి తినే వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక అమ్మాయి బొద్దింకను.. అది కూడా టమోటా-మిరపకాయ చట్నీతో తింటోంది.
 
సాధారణంగా టొమాటో-మిరపకాయ చట్నీతో మోమోస్ తింటారు. కానీ ఇక్కడ డిఫరెంట్. ఈ చట్నీతో  బొద్దింకలను తింటుంది. నూనెలో వేయించిన బొద్దింకలను ప్లేటులోకి తీసుకుని.. టమాటా -మిరపకాయ చట్నీతో తింటోంది. 
 
చూస్తేనే వాంతులు చేసుకునేలా వుండే ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇన్‌ఫేవరైట్‌విల్డ్ అనే ఐడీతో షేర్ చేశారు. అదే సమయంలో వీడియో చూసిన తర్వాత ప్రజలు భిన్నమైన కామెంట్స్ చేశారు.