శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 16 నవంబరు 2021 (19:33 IST)

ఏపీ ప్రజలకు శుభవార్త: ఆర్టీసి బస్సుల్లో కండక్టర్ వద్ద కొరియర్ బుకింగ్

బస్టాండ్ నుంచి మరో బస్టాండుకి గంటల్లో కొరియర్ కవర్ వచ్చేస్తుంది. ఎలాగో తెలుసా? ఏపీఎస్ ఆర్టీసి ఇకపై తమ కొరియర్ సేవలను పట్టణాలకే కాకుండా గ్రామాలకు కూడా విస్తరించనుంది. కిలో బరువు లోపు వున్న కవర్లను కండక్టరు వద్ద ఇస్తే దానికి తగిన రుసుము తీసుకుని మీరు పంపాల్సిన ప్రాంతానికి తీసుకుని వెళ్లి అందిస్తారు.

 
ఐతే ఈ కొరియర్ బుక్ చేసేటపుడు అవతలి వ్యక్తి పూర్తి చిరునామాతో పాటు ఫోన్ నెంబరు జోడించాలి. అలాగే అవతలి వారికి బస్సు వచ్చే సమయానికి బస్టాండులో వేచి వుండాలని తెలపాలి. మొత్తమ్మీద ఆర్టీసి కొరియర్ సేవలతో సమాచారం లేదా గిఫ్టులు తదితరాలు గంటల్లోనే చేరాల్సిన చోటుకి చేరిపోతాయి.