సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎంజీ
Last Updated : బుధవారం, 3 నవంబరు 2021 (20:36 IST)

పెట్రో ధరలపై కేంద్రం గుడ్‌న్యూస్

దీపావళి సందర్భంగా పెట్రో ధరలపై వాహనదారులకు కేంద్రం శుభవార్త  తెలిపింది. పెట్రోల్‌పై 5 రూపాయలు, డీజిల్‌పై 10 రూపాయలు ఎక్సైజ్ సుంకం తగ్గించాలని నిర్ణయించింది. తగ్గింపు ధరలు రేపటినుంచి అమల్లోకి రానున్నాయి.  
 
కేంద్రం నిర్ణయంతో సెంచరీ దాటి వాహనాదారులకు భారంగా మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గనున్నాయి. తగ్గిన పెట్రో ధరలు రేపటి నుంచి అమల్లోకి రానున్నట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించింది.     
 
పెట్రోలు ధరలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఈ ఏడాది జనవరి 1న లీటరు పెట్రోలు ధర రూ. 87.06 ఉండగా... ఇప్పుడు ఏకంగా రూ.114.37కి చేరుకుంది.

జనవరి నుంచి మార్చి వరకు పెట్రోలు రేట్లు పెంచుకుంటూ పోయిన చమురు సంస్థలు బెంగాల్‌ ఎన్నికల కారణంగా మార్చి, ఏప్రిల్‌లో ధరల పెంపుకు విరామం ఇచ్చాయి. ఆ తర్వాత మే నుంచి జూన్‌ వరకు తాజాగా అక్టోబరులో ఎడాపెడా రేట్లు పెంచుతూ వస్తున్నాయి.