శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : బుధవారం, 20 సెప్టెంబరు 2023 (12:48 IST)

షవర్మా తీసుకోవద్దు.. కేరళ, తమిళనాడులో ఇద్దరు విద్యార్థుల మృతి

shawarma
అరబు దేశంలో షవర్వా బాగా ఫేమస్. చికెన్, ఎగ్‌కోస్, ఉల్లిపాయ, మిరప్పొడిని కలిపి వీటిని తయారు చేస్తుంటారు. ఈ షవర్వాకు భారత్‌లో బాగా డిమాండ్ ఏర్పడింది. అయితే ఈ షవర్మను తాజాగా వుంటేనే తీసుకోవాలి. మరుసటి రోజు తీసుకుంటే అనారోగ్య సమస్యలు తప్పవంటున్నారు వైద్యులుయ 
 
కేరళ రాష్ట్రంలో ఇటీవల 'షవర్వా' తిన్న కొద్దిసేపటికి పాఠశాల విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. తమిళనాడులోనూ షవర్మా తిని 14 ఏళ్ల విద్యార్థిని దారుణంగా మరణించింది. దీంతో ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతాల్లో గల షవర్వా షాపుల్లో ఆరోగ్య శాఖ అధికారులు తనిఖీలు చేశారు. 
 
ఈ తనిఖీల్లో అనేక దుకాణాల్లో షవర్మా కోసం పాత మాంసాన్ని ఉపయోగిస్తున్నట్లు తేలింది. ఈ పాత చికెన్‌లో చేరిన కొన్ని బాక్టీరియాలు శరీరానికి వెళ్ళిన 6 గంటల సమయానికి లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని బాక్టీరియాలు 72 గంటల తర్వాత పని చేస్తుంది. అందుచేత షవర్మాను తీసుకోవడం మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.