Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేదల పెన్నిది, మనసున్న మహరాజు సోనూసూద్, అదంతా ఆయన నిర్ణయమేనంటున్న రియల్ హీరో

Written By వి
Updated: గురువారం, 30 జులై 2020 (17:39 IST)
సోనూసూద్ రీల్ లైఫ్‌లో విలన్ గానీ, లాక్ డౌన్ సందర్భంలో మాత్రం నిజమైన హీరోగా మారారు. వేల మంది వలస కార్మికులకు స్వస్థలాలకు పంపించి నిజ జీవితంలో సుప్రీంహీరోగా మారారు. వలస కూలీల కష్టాలకు చలించిపోయి సొంత డబ్బుతో వారిని ఇళ్లకు చేర్చి ప్రశంసలు పొందారు.
 
అది అక్కడితో ఆగలేదు. లాక్‌డౌన్ వల్ల విదేశాలలో చిక్కుకున్న దాదాపు 1500 మంది విద్యార్థులను ఇండియాకు తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా వలస కార్మికుల విషయంలో ప్రభుత్వాలు స్పందించే లోపే బస్సులు ఏర్పాటు చేసి వారిని తమ సొంత ఊర్లకు పంపించారు.
 
ప్రతి వలస కార్మికుడు తమ ఇంటికి చేర్చేంత వరకు ఆగలేదు. ఈ రియల్ హీరో సోనూసూద్ ఈ రోజు 47వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఆయన మరో మంచి కార్యాన్ని తలపెట్టాడు. దేశవ్యాప్తంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి దాదాపు 50వేల మందికి ఉచిత వైద్యం అందిస్తానని తెలిపారు. అంతేకాదు, చిత్తూరు జిల్లా రైతుకు ట్రాక్టర్ ఇవ్వడంపై చెబుతూ.. అదంతా పైవాడి దయ అనీ, దేవుడు నిర్ణయం మేరకే ఏదైనా జరుగుతుందన్నారు. తన తాహతుకొద్దీ సాయం చేశాను తప్ప ఇందులో నా గొప్పతనం ఏమీ లేదన్నారు.

అన్నీ చూడండి

Dhanush: ఇరుముడి నటి నక్షత్రను వీడియో కాల్‌లో ధనుష్ ప్రశంస, రష్మిక కితాబు

Kiku chiranjeevi: మా ఫ్లెక్సీలను తీసేసి డబ్బింగ్ సినిమా ఫ్లెక్సీలు పెడుతున్నారు : కికు యనమల

Thammareddy Bharadwaja :పెళ్లి చేసి చూడు అంటారు. అలా కొత్త సినిమా మేకింగ్ లో ఇబ్బందులు దాటాం

మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్ తో జగమే సంగీతం' ట్రైలర్‌

అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ సినిమా హైవాన్ ట్రైలర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments