ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : బుధవారం, 16 డిశెంబరు 2020 (21:19 IST)

కాళ్లను చుట్టుకున్న కొండ చిలువ.. విడిపించుకోలేక నానా తంటాలు

కొండ చిలువలకు మనుషులు దొరికారంటే.. వారిని దొరకబుచ్చుకుని కింద పడేసి చుట్టుకున్న సందర్భాలున్నాయి. ఇలాంటి ఘటనే మరొకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
 
ఓ ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన వీడియోలో ఓ కొండ చిలువ ఒక వ్యక్తి కాళ్లను చుట్ట చుట్టుకుంది. దాని నుంచి విడిపించుకోలేక ఆ వ్యక్తి నానా ఇబ్బంది పడ్డాడు. అక్కడే ఉన్న మరో వ్యక్తి.. ఆ భారీ సర్పాన్ని పట్టి వెనక్కి లాగాడు. కానీ ఆ పాము మాత్రం ఆ వ్యక్తిని విడవలేదు. 
 
అతికష్టం మీద పాము వెనక కొంత భాగాన్ని లాగిన మరో వ్యక్తి.. మొత్తం తొలగించేలోపే ఆ వీడియో ముగిసింది. చివరికి అతడికి ఏమైంది..? అనేది సస్పెన్స్ గానే మిగిలిపోయింది. కానీ ఈ వీడియో ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు.. భయపడుతున్న ఎమోజీలు పెడుతున్నారు. అయితే కొద్ది సేపటి తర్వాత ఈ వీడియోను ట్విట్టర్ డిలీట్ చేసింది. దానికి గల కారణాలు తెలియరాలేదు.