Daily Horoscope
✕

గణేశ్ నిమజ్జనం.. అప్పుడు 2 రోజులు.. ప్రస్తుతం ఒకరోజే..

Updated: గురువారం, 12 సెప్టెంబరు 2019 (10:09 IST)
వినాయకుడి నిమజ్జనాలు ప్రారంభమైన నేపథ్యంలో ఇదివరకు వినాయక నిమజ్జనం అంటే రెండు రోజుల పాటు జరిగేవి. కానీ ఎప్పుడైతే ఖైరతాబాద్ వినాయకుడిని ఉదయమే నిమజ్జనానికి తరలించారో.. అప్పటి నుంచీ దాదాపు ఒకే రోజున వినాయక నిమజ్జనం పూర్తవుతోంది. ఈసారి కూడా అదే విధంగా ప్లాన్ చెయ్యడం వల్ల నిమజ్జనం అర్థరాత్రి కల్లా పూర్తవుతుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. 
 
అంతేగాకుండా.. ఏ విగ్రహం ఎక్కడ నిమజ్జనం చేయాలో విగ్రహాన్ని ప్రతిష్టించిన రోజే ఖరారు చేయడం వల్ల నిమజ్జనం సాఫీగా సాగిపోయే అవకాశం వుంది. ఇంకా 20వేల మంది పోలీసుల భద్రత, 23 చెరువుల్ని నిమజ్జనానికి రెడీ చేయడం ద్వారా.. నిమజ్జన ప్రక్రియ వేగంగా జరిగే అవకాశాలున్నాయి. ఇందుకోసం 32 ప్రాంతాల్లో 93 క్రేన్లు, 134 మొబైల్ క్రేన్లను ఏర్పాటు చేశారు. 
 
బాలాపూర్ లడ్డూ వేలం తర్వాత శోభాయాత్ర ప్రారంభం కానుంది. బాలాపూర్ నుంచీ హుస్సేన్‌సాగర్ వరకూ శోభాయాత్ర జరుగనుండటంతో  ట్రాఫిక్ ఆంక్షలు అమలు అయ్యాయి. శోభాయాత్రలో విగ్రహాల వాహనాలకు మాత్రమే అనుమతి ఇవ్వడం..  అంబులెన్స్‌లకు మినహాయింపు ఇచ్చారు. ఇకపోతే.. ఈ ఏడాది హైదరాబాద్‌లో 60 వేల విగ్రహాల్ని భక్తులు ప్రతిష్టించారు. 

అన్నీ చూడండి

సన్ ఆఫ్ కనకదుర్గమ్మ లో లయ పోస్టర్ రిలీజ్ చేసిన అశ్వనీదత్, స్వప్న దత్

Fauji glimpse Update: ప్రభాస్ పుట్టినరోజు సర్‌ప్రైజ్: ఫౌజీ గ్లింప్స్ వీడియో రిలీజ్

మీకు సిగ్గుండాలి. నా శరీరం, నా ఆకృతి, నా గర్వం.. మీకెందుకయ్యా..? పాయల్ రాజ్‌పుత్

Kalki 2 shoot Over : కల్కి 2898 AD లో 5 కోట్ల విలువైన బుజ్జి కారు ధ్వంసం

OM: ధనుష్ – రాజ్‌కుమార్ పెరియసామి కాంబో చిత్రం ఓం నుంచి వీర వీర సాంగ్ విడుదల

తర్వాతి కథనం
Show comments