కేకే సర్వేస్ ఎగ్జిట్ పోల్ నిజమైతే వైఎస్ఆర్‌సిపి పరిస్థితి ఏంటి?
కేకే సర్వేస్ ఎగ్జిట్ పోల్స్ లో వెలువడిన ఫలితాలు వాస్తవమైతే వైఎస్ఆర్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లే అవుతుంది. ఆ సర్వే ప్రకారం అతి పెద్ద పార్టీగా 133 అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ, 21 స్థానాల్లో జనసేన, 7 స్థానాల్లో భాజపా గెలుస్తాయి. కేవలం 14 స్థానాలకే వైసిపి పరిమితమవుతుంది. మరి వాస్తవ ఫలితాలు తేలాలంటే ఈ నెల 4 వరకూ వేచి చూడాల్సిందే. కాగా ఇప్పటివరకూ వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ లో అత్యధికంగా కూటమిదే అధికారం అని తేల్చాయి.
పిఠాపురంలో పవన్ భారీ విజయం ఖాయం
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిదే పీఠం అని ప్రధాన మీడియా సంస్థలు తెలుపుతున్నాయి. ఓటర్ల నుంచి అభిప్రాయ సేకరణ చేసిన మీదట ఆయా సంస్థలు ఈ ఫలితాలను వెల్లడించాయి. మే 13న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరిగాయి. గతంలో లేనంతగా ఏపీ ప్రజలు అత్యధిక శాతం ఓటింగులో పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన-భాజపా కూటమిదే అధికారం అంటూ తేల్చాయి.
పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భారీ మెజారిటీతో విజయం సాధించబోతున్నారని ఆరా మస్తాన్ తన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో వెల్లడించింది. జనసేన పోటీ చేసిన 2 లోక్ సభ సీట్లను కైవసం చేసుకుంటుందని వెల్లడించారు. తెనాలి నుంచి పోటీ చేసిన జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ కూడా విజయం సాధిస్తారని తెలియజేసారు.