Dharma Sangrah
✕

మోడీకి ప్లస్.. చంద్రబాబుకి మైనస్.. ఏంటి?

Written By జె
Updated: సోమవారం, 11 ఫిబ్రవరి 2019 (20:33 IST)
మోడీ - చంద్రబాబులకు మధ్య జరుగుతున్న మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ప్రధానమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఏకంగా ఎపి సిఎం చంద్రబాబునాయుడును టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. అది కూడా చంద్రబాబు తన వారసుడిని రాజకీయంగా నిలబెట్టాలని పాకులాడుతున్నారని, లోకేష్‌‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో చంద్రబాబునాయుడు కూడా అదేస్థాయిలో మోడీకి సమాధానం కూడా ఇచ్చారు.
 
కానీ చంద్రబాబు మాట్లాడిన తీరు విశ్లేషకులనే ఆశ్చర్యపరుస్తోంది. రాజకీయంగా తన కుటుంబాన్ని సుస్థిరం చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని మోడీ చెప్పారు కానీ బాబు మాత్రం ఏకంగా మోడీ కుటుంబ సభ్యులనే టార్గెట్ చేశారు. తల్లిని, భార్యను పట్టించుకోని మోడీ కూడా నా గురించి మాట్లాడుతారా. భార్యకు విడాకులు కూడా ఇవ్వకుండా వదిలేసిన వ్యక్తి మోడీ అంటూ ధ్వజమెత్తారు చంద్రబాబు. తెలుగుదేశం పార్టీ అధినేత ఈ విధంగా మాట్లాడటం దేశ రాజకీయాల్లో చర్చ నీయాంశంగా మారింది. 
 
ఎందుకంటే ఒక దేశానికి ప్రధానికి ఉన్న వ్యక్తిపై ఇంతటి వ్యాఖ్యలు చేయడం సరికాదంటున్నారు విశ్లేషకులు. ప్రధానమంత్రి మోడీని చంద్రబాబు నాయుడు తిట్టడం వల్ల మోడీకే లాభం తప్ప బాబుకు ఏ మాత్రం లాభం ఉండదంటున్నారు. నిన్న జరిగిన ఎపిసోడ్ చూస్తుంటే మోడీకి ప్లస్ గాను, చంద్రబాబుకు మైనస్ గాను మారిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

అన్నీ చూడండి

Action King Arjun: శ్రీరామ జ‌న్మ‌భూమి అయోధ్య‌లో యాక్షన్ కింగ్ అర్జున్ చిత్రం పూజా కార్య‌క్ర‌మాలు

దక్షిణ కొరియాకు చెందిన హ్యేయిన్ కిమ్‌తో గల్లా జయదేవ్ చిన్న కుమారుడి పెళ్లి

No postephoned Varanasi : వారణాసి పై అప్ డేట్ ఇచ్చిన నిర్మాణ సంస్థ - కొత్త ఒరవడితో మహేష్ బాబు

Naga Chaitanya: ప్రతి ఫ్రేమ్‌లో వీఎఫ్‌ఎక్స్ వర్క్ ఉండే కథతో వృషకర్మ : నాగ చైతన్య

NTR’s new house : శ్రీరాముడి చిత్రపటాన్ని కొత్త ఇంటికి స్వాగతించిన ఎన్టీఆర్

తర్వాతి కథనం
Show comments