ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 24 మార్చి 2021 (11:59 IST)

కర్నాటక మంత్రి రాసలీలల కేసు: నన్ను బలవంతంగా చెన్నై పట్టుకొచ్చారంటూ యువతి ఫోన్...

కర్నాటక మంత్రి జార్కిహొళి రాసలీలల కేసు ఎటు నుంచి ఎటు వెళ్తుందో ఎవ్వరికీ అంతుబట్టడంలేదు. ఈ నెల 2న మంత్రి రాసలీలల వీడియోలు అంటూ మీడియాలో హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. ఐతే అవన్నీ మార్ఫింగ్ వీడియోలనీ, ఆ యువతి ఎవరో కూడా తనకు తెలియదన్నారు మంత్రి.
 
కాగా మంత్రి రాసలీలల వీడియోలు వచ్చినప్పట్నుంచి అందులో కనిపించిన యువతి అజ్ఞాతంలోనే వుంటోంది. ఆమెను పోలీసులు ట్రేస్ చేయలేకపోతున్నారు. తొలుత గోవా నుంచి ఫోన్ చేసి తను సురక్షితంగా వున్నానంటూ తన తల్లిదండ్రులకు చెప్పింది. ఆ తర్వాత బెంగళూరులోనే మరో చోటు నుంచి ఫోన్ చేసి తన కోసం ఎవ్వరూ ఫోన్ చేయవద్దని తెలిపింది.
 
తాజాగా ఆమె తన తల్లిదండ్రులకు చెన్నై నుంచి ఫోన్ చేసినట్లు సమాచారం. తనను బలవంతంగా చెన్నై తీసుకువచ్చారనీ, నా పరిస్థితి ఏంటో తెలియడంలేదనీ, తను పూర్తి ఒత్తిడికి లోనై వున్నట్లు చెప్పిందని పోలీసులకు తెలిపారు ఆమె తల్లిదండ్రులు. కాగా ఆమెను చెన్నై నుంచి మధ్యప్రదేశ్ భోపాల్‌కి తరలించినట్లు పోలీసులకు సమాచారం వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద కర్నాటక మంత్రి రాసలలీల కేసు ఓ పట్టాన కొలిక్కి రావడంలేదు.